»   » ‘శ్రీమంతుడు’ 19 డేస్ కలెక్షన్... (ఏరియా వైజ్)

‘శ్రీమంతుడు’ 19 డేస్ కలెక్షన్... (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘శ్రీమంతుడు' 19వ రోజుల్లో ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో రూ. 55 కోట్ల షేర్ సాధించింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ వివరాలు తెలియాల్సి ఉంది.

17 రోజుల్లోనే ఈచిత్రం వరల్డ్ వైడ్ తెలుగు, తమిళం వెర్షన్లు కలిపి 76 కోట్ల షేర్ సాధించింది. సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డుల కెక్కింది.


శ్రీమంతుడు మూవీ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది' రికార్డులను 18రోజుల్లో బద్దలు కొట్టి...‘బాహుబలి' తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలించింది. శ్రీమంతుడు చిత్రం 19 రోజుల్లో ఏపి, తెలంగాణల్లో ఎంత వసూలు చేసిందనే వివరాలు స్లైడ్ షోలో...


నైజాం

నైజాం

నైజాంలో 19వ రోజుల ఈచిత్రం 12 లక్షల షేర్ వసూలు చేసింది. ఇప్పటి వరకు టోటల్ 19.62 కోట్లు షేర్ వసూలు చేసింది.


కృష్ణ

కృష్ణ

కృష్ణ జిల్లాలో ఈ చిత్రం 19వ రోజు 2 లక్షల షేర్ సాధించింది. టోటల్ 3.94 కోట్ల షేర్ సాధించింది.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరులో 19వ రోజు 2 లక్షల షేర్ సాధించింది. టోటల్ 1.85 కోట్ల షేర్ సాధించింది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరిలో 19వ రోజు శ్రీమంతుడు రూ. 3 లక్షల షేర్ సాధించింది. టోటల్ 3.93 కోట్ల షేర్ సాధించింది.


ఇతర ప్రాంతాలు

ఇతర ప్రాంతాలు

సీడెడ్, గుంటూరు, ఈస్ట్, ఉత్తరాంధ్ర షేర్ వివరాలు తెలియాల్సి ఉంది. ఓవరాల్ గా ఏపి, తెలంగాణలో కలిపి ఈ చిత్రం 19 రోజుల్లో దాదాపు రూ. 55 కోట్ల షేర్ సాధించినట్లు సమాచారం.


English summary
Srimanthudu has collected a share of 55 Cr approximately after it's 19th day in Andhra Pradesh and Telangana alone.
Please Wait while comments are loading...