»   » కలెక్షన్స్ కుమ్మేసింది: ‘శ్రీమంతుడు’ ఫస్ట్ డే షేర్ డీటేల్స్

కలెక్షన్స్ కుమ్మేసింది: ‘శ్రీమంతుడు’ ఫస్ట్ డే షేర్ డీటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' మూవీ ఓపెనింగ్స్ ఇరగ దీసింది. వరల్డ్ వైడ్ భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఓవర్సీస్ ఇలా అన్ని ప్రాంతాల్లో కలిపి తొలిరోజు రూ. 30 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ మూవీ నాన్-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. ఒక్క వెస్ట్ గోదావరి లోనే ఈ మూవీ ఫస్ట్ డే 1.70 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది.

మహేష్ బాబు హీరోగా నటించడం, ‘మిర్చి' ఫేం కొరటల శివ దర్శకత్వం కావడంతో ఈ సినిమాపై మొదటి నుండీ మంచి భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ రిలీజైన తర్వాత అంచనాలు ఆకాశాన్నంటాయి. సినిమా విడుదల ముందు మహేష్ బాబు ప్రమోషన్ల విషయంలో చాలా కేర్ తీసుకున్నారు.


Srimanthudu first day share details

అన్ని ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఈవన్నీ సినిమాకు బాగా ప్లస్సయ్యాయి. అందరూ ఊహించిన విధంగానే ‘శ్రీమంతుడు' విడుదలైన ఫస్ట్ షోకే పాజిటివ్ రివ్యూస్, పాజిటివ్ మౌత్ టాక్ సొంతం చేసుకుంది. సొంతూరుకు ఏదైనా చేయాలనే కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమాకు ఫిదా అయిపోయారు. సినిమాలో మహేష్ బాబు స్మార్ట్ లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.


మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం.


ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
Srimanthudu movie collected a total share of close to 30 crores on the first day of its release.
Please Wait while comments are loading...