»   » ‘శ్రీమంతుడు’: ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 80 కోట్లు!(ఏరియా వైజ్)

‘శ్రీమంతుడు’: ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 80 కోట్లు!(ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘శ్రీమంతుడు' మూవీ మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. సినిమా ఓవరాల్ బిజినెస్ రూ. 80 కోట్లు క్రాస్ అయింది. ఇప్పటికే ఈచిత్రానికి వివిధ ప్రాంతాల్లో థియేట్రికల్ రైట్స్(తెలుగు వెర్షన్) ద్వారా రూ. 58 కోట్లు వసూలు కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

‘శ్రీమంతుడు' సినిమా మహేష్ బాబు కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబు నటించిన ‘దూకుడు' సినిమా విడుదలైన తర్వాత రూ. 56 కోట్లు వసూలు చేసింది. ‘శ్రీమంతుడు' సినిమా విడుదల ముందే ఆ మార్కును క్రాస్ చేయడం గమనార్హం.

శ్రీమంతుడు మూవీ ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటేల్స్

నైజాం(అభిషేక్ పిక్చర్స్): రూ. 14.4 కోట్లు
సీడెడ్(కడప బ్రహ్మ): రూ. 7.2 కోట్లు
వైజాగ్(జిఎస్ఆర్ ఫిల్మ్స్): రూ. 5 కోట్లు
గుంటూరు : రూ. 4.20 కోట్లు
ఈస్ట్(వింటేజ్ ఫిల్మ్స్): రూ. 3 కోట్లు
వెస్ట్(ఆదిత్య ఫిల్మ్స్): రూ. 3.10 కోట్లు
కర్నాటక(ఎన్ఎస్ఆర్-బృందా అసోసియేట్స్): రూ. 6 కోట్లు
ఓవర్సీస్(క్లాసిక్ ఎంటర్టెన్మెంట్స్): రూ. 8.2 కోట్లు
రెస్టాఆఫ్ ఇండియా: రూ. 2 కోట్లు

ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: రూ. 58 కోట్లు

శాటిలైట్స్ రైట్స్ రూ. 17 కోట్లు, ఆడియో, ఇతర రైట్స్: 2 కోట్లు, తమిళ డబ్బింగ్ రైట్స్: రూ. 3 కోట్లు.... టోటల్ బిజినెస్ ఇప్పటి వరకు రూ. 80 కోట్లకు చేరుకుంది.

English summary
Srimanthudu Worldwide Pre-Release Business details.
Please Wait while comments are loading...