»   » ఇదీ...అమీర్ ఖాన్ కు రాజమౌళి సవాల్

ఇదీ...అమీర్ ఖాన్ కు రాజమౌళి సవాల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో ఒకటే వార్త. అమీర్ ఖాన్ తో రాజమౌళి ప్రాజెక్టు చేస్తాడంటూ చాలా కాలంగా మీడియాలో వినపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ అది మెటీరియలైజ్ కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం అమీర్ ఖాన్ ని డైరక్ట్ గా రాజమౌళి తన తాజా చిత్రం బాహుబలితో ఎదుర్కొని తన సత్తా చూపబోతున్నట్లు బాలీవుడ్ సమాచారం.

 SS Rajamouli's Baahubali 2 v/s Aamir Khan's Dangal

అందుతున్న సమాచారం రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి-2', ఆమీర్ ఖాన్ 'దంగల్' ఈ ఏడాది ఒకేసారి బాక్సాఫీస్ వద్ద ఢీ కొనబోతున్నట్లు సమాచారం. అదీ క్రిసమస్ సీజన్ లో. రిలీజ్ డేట్స్ ఇంకా కన్ఫర్మ్ కానప్పటికీ.. ఒకే సమయంలో ఇంకా చెప్పాలంటే ఒకేరోజు ..క్రిసమస్ 2016న ఇవి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క జంటగా 'బాహుబలి- ది కన్‌క్లూజన్‌' ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ప్రపంచ స్ధాయిలో రికార్డుస్థాయి కలెక్షన్లు కొల్లగొట్టిన 'బాహుబలి' సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమాపై ఓ రేంజిలో అంచనాలే ఉన్నాయి. హిందీలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేయాలని నిర్ణయించారు.

 SS Rajamouli's Baahubali 2 v/s Aamir Khan's Dangal

మరో ప్రక్క 'పీకే' సినిమాతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి.. ఊపు మీద ఉన్న ఆమిర్ ఖాన్ కూడా 'దంగల్' సినిమాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. రెజిలింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

వీరిద్దరి మధ్యా పోటీ అనేది ప్రక్కన పెడితే... 'బాహుబలి-2', 'దంగల్' విడుదల గురించి సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండూ ఒకే సీజన్ లో రిలీజ్ అయితే వారికి డబుల్ ధమాకే.

English summary
As per latest reports, Aamir Khan's Dangal and Baahubali: The Conclusion will be clashing at the box office this year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu