RRR day 5 collections బాక్సాఫీస్‌పై రాంచరణ్, ఎన్టీఆర్ దండయాత్ర.. జక్కన టార్గెట్‌కు చేరువగా..

ప్రపంచవ్యాప్తంగా RRR మూవీ కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. విడుదలైన ప్రతీ చోట, ప్రతీ దేశంలోను, ప్రతీ గడ్డ మీద కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తున్నది. గత నాలుగు రోజుల్లో RRR మూవీకి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా పోయింది. ఇక ఐదో రోజు కూడా ఎలాంటి క్షీణత లేకుండా కలెక్షన్ల వసూళ్లు రాబట్టింది. ఐదో రోజు మంగళవారం ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే..

 5వ రోజు హిందీ వెర్షన్ వసూళ్లు

5వ రోజు హిందీ వెర్షన్ వసూళ్లు


RRR సినిమా గురించి ట్రేడ్ నిపుణులు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. RRR సినిమా హిందీ వెర్షన్ అద్భుతంగా ఫలితాలను సాధిస్తున్నది. నాలుగో రోజుతో పోల్చుకొంటే 5వ రోజు 5 శాతం మేర తగ్గుదల కనిపించింది. కానీ వసూళ్ల విషయంలో పెద్దగా ప్రభావం చూపలేదు. 5 రోజున హిందీ వెర్షన్ 16 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు చెప్పాయి.

 హిందీలో 100 కోట్ల మార్కు దాటే..

హిందీలో 100 కోట్ల మార్కు దాటే..


RRR హిందీ వెర్షన్‌ విషయానికి వస్తే.. ఐదు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును అధిగమించే అవకాశం ఉంది. శుక్రవారం 19 కోట్లు, శనివారం 24 కోట్లు, ఆదివారం 31 కోట్లు, సోమవారం 17 కోట్లు రాబట్టింది, మంగళవారం 15 నుంచి 16 కోట్లు సాధించే అవకాశం ఉంది. ఇక ఇక దేశవ్యాప్తంగా ఈ చిత్రం 600 కోట్ల మార్కును దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను అధిగమించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

 యూఎస్‌లో 10 మిలియన్ల మార్కు

యూఎస్‌లో 10 మిలియన్ల మార్కు


అమెరికాలో RRR సినిమా భారీ వసూళ్లను రాబడుతున్నది. ప్రీమియర్లతోపాటు ఐదు రోజుల్లో 10 మిలియన్ల మార్కును దాటేసింది. ఇటీవల కాలంలో, 2022వ సంవత్సరంలో ఇలా వసూళ్లను సాధించిన చిత్రం మరోటి లేదనే విషయం స్పష్టమైంది. ఈ ఏడాదిలో భారీ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డును సాధించింది.

 సీడెడ్‌లో జైత్రయాత్ర

సీడెడ్‌లో జైత్రయాత్ర

ఇక ఆంధ్రాలో సీడెడ్ ప్రాంతంలో RRR మూవీ కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. 4 రోజుల్లో 31.9 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రం.. 5 రోజున కూడా అదే జోష్‌ను కొనసాగించింది. బాహుబలి లైఫ్ టైమ్‌లో సాధించిన వసూళ్లను ఈ సినిమా కేవలం 5 రోజుల్లో అధిగమించే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ చిత్రం 50 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది.

తమిళనాడు, బీహార్, ఒడిశాలో

తమిళనాడు, బీహార్, ఒడిశాలో


RRR సినిమా తమిళనాడులో 5 రోజుల్లో 40 కోట్లు రాబట్టింది. ఇక ఒడిశా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఊహించని వసూళ్లను సాధిస్తున్నది. ప్రేక్షకుల్లో ఎన్నడూ చూడని స్పందన రావడంతో ఆ రెండు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. ఉదయం 5 గంటలకే ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ షోలు ప్రదర్శించడం విశేషంగా మారింది.

 5వ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా

5వ రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా


ఇక RRR సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు 15 నుంచి 16 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. నాలుగో రోజు 35 కోట్లు వసూలు చేయడంతో 157 కోట్ల షేర్, 232 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5వ రోజున 15 కోట్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ చిత్రం 250 కోట్ల మార్కును దాటే ఛాన్స్ కనిపిస్తున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 317 కోట్ల షేర్; 565 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఐదో రోజున ఈ చిత్రం మరో 35 కోట్లు రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 600 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X