»   » సరికొత్త రికార్డ్స్: బాహుబలి-2 శాటిలైట్ రైట్స్!

సరికొత్త రికార్డ్స్: బాహుబలి-2 శాటిలైట్ రైట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొదటి భాగం మాదిరిగానే.... ప్రతి విషయంలోనూ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకెలుతున్న బాహుబలి-2 మూవీ తాజాగా శాటిలైట్ రైట్స్ విషయంలో కూడా సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు తెలుస్తోంది.

బాహుబలి తొలిపార్ట్ శాటిలైట్ రైట్స్ ను భారీ ధరకు దక్కించుకున్న మాటీవీ.... సెకండ్ పార్ట్ ని రూ. 30 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఇది కేవలం తెలుగు వెర్షన్ కు సంబంధించిన డీల్ మాత్రమే అని టాక్.


అన్నీ కలిపి 100 కోట్ల అంచనా

అన్నీ కలిపి 100 కోట్ల అంచనా

హిందీ, తమిళం, మళయలం ఇవన్నీ కలిసి బాహుబలి-2 శాటిలైట్ రైట్స్ బిజినెస్ రూ. 100 కోట్ల పైనే జరుగుతుందని అంచనా. రోబో 2 రైట్స్ ఓవరాల్ శాటిలైట్ రైట్స్ 110 కోట్ల అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 కూడా అటు ఇటుగా అంతే బిజినెస్ చేస్తుందని టాక్.
తెలుగులో రికార్డ్

తెలుగులో రికార్డ్

తెలుగు సినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్ రూపంలోనే రూ. 30 కోట్లు రావడం ఇదే హయ్యెస్ట్ రికార్డ్ అని అంటున్నారు. శాటిలైట్ రైట్స్ ఇంత భారీ ధరకు దక్కించుకున్న మా టీవీ సినిమా 50 రోజులు పూర్తి కాగానే టీవీ ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


గ్రాండ్ రిలీజ్

గ్రాండ్ రిలీజ్

బాహుబలి 2 మూవీ ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దాదాపు 6500 థియేటర్లలో సినిమా రిలీజవుతోంది. ప్రీ బుకింగ్ పేరుతో ఆన్ లైన్లో టికెట్ బుకింగ్ కూడా మొదలైంది. సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని కార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


ముందు అప్పులు కట్టండి : బాహుబలి-2 రిలీజ్ ఆపాలని పిటీషన్!

ముందు అప్పులు కట్టండి : బాహుబలి-2 రిలీజ్ ఆపాలని పిటీషన్!

బాహుబలి 2 సినిమా రిలీజ్ ఆపాలంటూ మద్రాస్ హై కోర్టులో పిటీషన్ దాఖలైంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
As per highly placed sources, Star Maa acquired the Satellite Rights of 'Baahubali: The Conclusion' by paying a record price. The deal was closed for a much higher price than what 'Baahubali: The Beginning' fetched.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu