For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sridevi Soda Center Total Collections: సుధీర్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. ఇంతకీ హిట్టా ఫట్టా!

  |

  కృష్ణ అల్లుడిగా, మహేశ్ బాబు బావగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ అండ్ టాలెంటెడ్ గాయ్ సుధీర్ బాబు. ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో మెప్పించిన అతడు.. స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. బ్యాగ్రౌండ్ ఉన్నా ఎంతో కష్టపడే అతడు.. అప్పట్లోనే 8 ప్యాక్ బాడీతో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

  అంతేకాదు, ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి... అక్కడ పలు చిత్రాల్లో నటించాడు. తద్వారా తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. అయితే, అతడికి ఈ మధ్య కాలంలో హిట్ మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో 'శ్రీదేవి సోడా సెంటర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఇంతకీ ఇది హిట్టా ఫట్టా? చూద్దాం పదండి!

  శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వచ్చాడు

  శ్రీదేవి సోడా సెంటర్ అంటూ వచ్చాడు

  సరైనా హిట్ కోసం వేచి చూస్తోన్న సుధీర్ బాబు నటించిన తాజా చిత్రమే ‘శ్రీదేవి సోడా సెంటర్'. ఆనంది హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని కరుణ కుమార్ దర్శకత్వంలో 70ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ప్యూర్ లవ్ స్టోరీతో ఈ సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

  Bigg Boss: షోలో శృతి మించిన రొమాన్స్.. పక్క పక్కన పడుకుని ఆ భాగాలను తాకుతూ దారుణంగా!

  భారీ అంచనాలు.. బిజినెస్ ఎక్కువగా

  భారీ అంచనాలు.. బిజినెస్ ఎక్కువగా

  పాటలు, టీజర్, ట్రైలర్‌లు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉన్న కారణంగా సుధీర్ బాబు నటించిన ‘శ్రీదేవి సోడా సెంటర్'పై ఆది నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 8 కోట్లు వరకూ వ్యాపారం జరిగినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  మంచి స్పందన రావడంతో దూకుడు

  మంచి స్పందన రావడంతో దూకుడు

  ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ‘శ్రీదేవి సోడా సెంటర్' మూవీకి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్ డేన కలెక్షన్లు భారీగా వచ్చాయి. దీంతో ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే టార్గెట్‌ను రీచ్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఫుల్ రన్‌లో కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీంతో చాలా చోట్ల టార్గెట్ కూడా దాటలేదు.

  Bigg Boss: ప్రియాంకకు రామ్ చరణ్ బంపర్ ఆఫర్.. నిహారిక పేరు చెప్పగానే ప్రామిస్.. హమీదాకు కూడా!

  సినిమాకు ఎక్కవ ఎంత వచ్చిందంటే?

  సినిమాకు ఎక్కవ ఎంత వచ్చిందంటే?

  ముగింపు సమయానికి ‘శ్రీదేవి సోడా సెంటర్' మూవీకి నైజాంలో రూ. 1.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 75 లక్షలు, ఈస్ట్‌లో రూ. 46 వేలు, వెస్ట్‌లో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 49 లక్షలు, కృష్ణాలో రూ. 28 లక్షలు, నెల్లూరులో రూ. 17 లక్షలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 4.91 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.35 కోట్లు గ్రాస్‌‌ వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

  ‘శ్రీదేవి సోడా సెంటర్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. ఇక, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో ముగింపు సమయానికి ఈ చిత్రానికి రూ. 14 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 29 లక్షలు వసూలు అయ్యాయి. వీటిని కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా రూ. 5.34 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.25 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఫలితంగా 63 శాతమే రికవరీ అయింది.

  Bigg Boss: షోలో ఆ హీరోను అవమానించిన నాగార్జున.. స్టేజ్ మీదే ఆమెతో అలా చేయడంతో విమర్శలు

  Prabhas Special Interview With Sridevi Soda Center Team
  ఇంతకీ ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే

  ఇంతకీ ఈ సినిమా హిట్టా ఫట్టా అంటే

  ‘శ్రీదేవి సోడా సెంటర్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.50 కోట్లుగా నమోదైంది. ముగింపు సమయానికి ఈ చిత్రం రూ. 5.34 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే.. దీనికి రూ. 3.16 కోట్లు నష్టం వచ్చింది. ఫలితంగా సుధీర్ కెరీర్‌లో మరో ఫ్లాప్ చేరినట్లు అయింది. టాక్ బాగున్నా పరిస్థితులు అనుకూలించకపోవడమే ఈ ఫలితానికి కారణం అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

  English summary
  Sudheer Babu Recently Did a Film Sridevi Soda Center Under Karuna Kumar Direction. This Movie Collect 5.34CR in Full Run.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X