Sundarakanda 7 days Collections: షాకింగ్‌గా సుందరకాండ కలెక్షన్లు.. నారా రోహిత్ భారీ నష్టాలను తప్పించుకోవాలంటే?

యువ హీరో నారా రోహిత్, సీనియర్ హీరోయిన్ శ్రీదేవీ విజయ్ కుమార్, నూతన నటి వ్రితీ వఘానీ నటించిన సుందరకాండ చిత్రం ఆగస్టు 27వ తేదీ వినాయకచవితి పండుగ కానుకగా రిలీజైంది. ఈ చిత్రంలో వీకే నరేష్, వాసుకీ ఆనంద్, సత్య, అభినవ్ గోమటం, సిరి లేళ్ల, వీటీవీ గణేష్, అజయ్, రూపాలక్ష్మీ, సునైనా, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నూతన దర్శకుడు వెంకటేశ్ నిమ్మలపూడి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నారా రోహిత్.. తన ఇమేజ్‌కు భిన్నంగా చేసిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం, ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫిని, రోహన్ చిల్లాలే ఎడిటింగ్, రాజేశ్ పెంటకోట ఆర్ట్ విభాగాలను పర్యవేక్షించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమా బడ్డెట్ సుమారుగా 15 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఈ సినిమాకు 8 కోట్ల రూపాయలు థియేట్రికల్ బ్రేక్ ఈవెన్‌గా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 8 కోట్ల షేర్, 16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Sundarakanda 1st Week Expected Box Office

సుందరకాండ సినిమాను రెండు రోజుల ముందుగానే ప్రీమియర్లను ప్రదర్శించారు. దాంతో ఈ మూవీపై ఫుల్లుగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. అంతా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన వసూళ్ల ప్రయాణాన్ని కొనసాగిస్తుందని భావించారు. అయితే ఈ సినిమాకు ఊహించని విధంగా ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడం ఇండస్ట్రీ వర్గాలకు షాకిచ్చింది. అయితే ఈ సినిమాకు రిలీజ్ తర్వాత కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహించినా బాక్సాఫీస్ వద్ద ఆశాజనక పరిస్థితి కనిపించకపోవడం గమనార్హం.

నారా రోహిత్ నటించిన లవ్, రొమాంటిక్ డ్రామాకు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు ఈ సినిమా 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు, రెండో రోజు 50 లక్షల గ్రాస్ వసూళ్లు, మూడో రోజు 60 లక్షలు, నాలుగో రోజు 90 లక్షలు, ఐదో రోజు 1 కోటి రూపాయలు, ఆరో రోజు 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఏఢో రోజు మంగళవారం కూడా ఈ చిత్రం 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లనుు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం 6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు, 3 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. రెండో వారంలో ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్పా.. లాభాల దరికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కొత్త లోక మూవీ నుంచి భారీ పోటీ ఎదుర్కొంటున్నది. రానున్న రోజుల్లో అంటే సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఘాటీ, మదరాసి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాల నుంచి వచ్చే పోటీని తట్టుకొని బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X