»   »  గాండ్రిస్తాడా..? (సందీప్ కిషన్ 'టైగర్‌' ప్రివ్యూ)

గాండ్రిస్తాడా..? (సందీప్ కిషన్ 'టైగర్‌' ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: వెంకటాద్రి ఎక్సప్రెస్ చిత్రం తర్వాత సరైన హిట్ పడని సందీప్ కిషన్...తాజాగా మరో చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి భాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు. ప్రేమ, స్నేహం.. నడుమ సాగే గమ్మత్త్తెన థ్రిల్లర్‌ ఈ చిత్రమని చెప్తున్నారు. దర్సక,నిర్మాతలు వారితో పాటు సందీప్ కిషన్ ....ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు.

'టైగర్‌' చిత్రానికి వి.ఐ. ఆనంద్‌ దర్శకత్వం వహిస్తుండగా ఠాగూర్‌ మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 'ఈ చిత్రం కాశీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ కథని.. అదే విధంగా వినోదానికి ప్రాధాన్యం ఉందని చిత్ర దర్శకుడు ఆనంద్‌ అన్నారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ విషయమై సందీప్ కిషన్ ఇలా ట్వీట్ చేసారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఒక వాస్తవ సంఘటన ఆధారంగా రాసిన కథ ఇది. రాజమండ్రి లోని ఇద్దరు స్నేహితులలో ఒకరు చదువు కోసం వెళ్లి అక్కడ ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి.. దానికి తన స్నేహితుడు ఎలా స్పందించాడు. అనే అంశంతో కథనం వుంటుంది.


సందీప్ కిషన్ మాట్లాడుతూ... 'సినిమా మొదలైన 21వ నిమిషానికి నా పాత్ర వస్తుంది. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే ప్రధాన బలం. నిడివి కూడా గంట యాభై నిమిషాలు (1:58 గం.) మాత్రమే వుంటుంది. నాకు హీరోయిన్ కూడా ఉండదు. కానీ కథలో కీలకం. అంతఃపురం సినిమాలో జగపతిబాబు పాత్రలా' అని చెప్పుకొచ్చారు.


అలాగే నిజానికి ఇందులో నా పాత్ర పేరు టైగర్. కథలో ప్రధాన పాత్ర. దర్శకుడు తమిళంలో అక్బర్ అనే పేరుతో రాసుకున్నారు. మన నేటివిటికి అనుగుణంగా చేసిన మార్పుల్లో టైగర్ అని నిర్ణయించడం జరిగింది. ఆ పేరెందుకు పెట్టామో సినిమా చూశాక మీకు తెలుస్తుంది అన్నారు.


చిత్రవిశేషాలను ఎన్వీ ప్రసాద్ చెబుతూ - "ప్రేమ, స్నేహం, యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలున్న మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. సందీప్ కిషన్ ది ఫుల్ మాస్ మరియు ఎనర్జిటిక్ కారెక్టర్. తమన్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకం ఉంది" అని చెప్పారు.


‘ఠాగూర్' మధు మాట్లాడుతూ - "ఇది పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. హీరోగా సందీప్ కిషన్ కెరీర్ ని మరో స్థాయికి తీసుకెళ్లే చిత్రం అవుతుంది. అన్నివర్గాల వారూ చూడదగ్గ విధంగా చిత్రం ఉంటుంది. " అన్నారు.


Sundeepkishan's Tiger preview

బ్యానర్ :ఎన్వీఆర్
నటీనటులు :సందీప్‌ కిషన్‌, సీరత్‌కపూర్‌, రాహుల్‌ రవీంద్రన్‌ , తనికెళ్ల భరణి, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, పృథ్వీరాజ్. సుప్రీత్, ప్రవీణ్ తదితరులు
మాటలు: అబ్బూరి రవి,
కెమెరా: ఛోటా కె. నాయుడు,
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్,
ఫైట్స్: వెంకట్,
ఆర్ట్: రాము,
ఆఫీస్ ఇన్ చార్జ్: భగ్గా రామ్,
కో-డైరెక్టర్: పుల్లారావు కొప్పినీడి,
లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.
కథ,స్క్రీన్ ప్లే, దర్సకత్వం : వి.ఐ. ఆనంద్‌
నిర్మాతలు: ఠాగూర్‌ మధు, మెగాసూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఎన్వీ ప్రసాద్‌
విడుదల తేది: 26, జూన్ 2015.

English summary
sundeep kishan tweeted his latest Tiger releasing today (June 26, 2015).
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu