»   » షాక్ ఇచ్చిన 'జక్కన్న' ‌:రివ్యూలకు రెవిన్యూకు సంబంధం లేదు, బడ్జెట్, కలెక్షన్స్ ఇవిగో

షాక్ ఇచ్చిన 'జక్కన్న' ‌:రివ్యూలకు రెవిన్యూకు సంబంధం లేదు, బడ్జెట్, కలెక్షన్స్ ఇవిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హాస్యనటుడి నుంచి హీరోగా ఎదిగిన నటుడు సునీల్‌. అందాల రాముడు, మర్యాదరామన్నగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌ ఇప్పుడు 'జక్కన్న'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొన్న శుక్రవారం ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే మార్నింగ్ షోకే ఈ చిత్రం డివైడ్ టాక్ ని తెచ్చుకుంది.

అయితే నెగిటివ్ రివ్యూలు ప్రక్కన పెట్టి జనం ఈ వీకెండ్ లో జక్కన్నను బాగానే ఆదిరించారు. చాలా చోట్ల హౌస్ ఫుల్ అయ్యింది. ఫస్ట్ వీకెండ్ లో మంచి రెవిన్యూ వచ్చింది. ఈ విషయంలో సినిమాలో కామెడీ ట్రాక్స్ ద్వారా నవ్వు తెప్పించిన సప్తగిరి,పృధ్వీలకు ...సునీల్ ధాంక్స్ చెప్పుకోవాలి.


దాదాపు 12 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం మొదటి వారాంతంలోనే దాదాపు 70% పెట్టిబడి రికవరీ అయ్యింది. అయితే బ్రేక్ ఈవెన్ రావాల్సి ఉంది. సెకండ్ వీకెండ్ దాకా కలెక్షన్స్ స్టడీగా ఉంటే బ్రేక్ ఈవెన్ వస్తుంది. కానీ సోమవారం నుంచి చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయినట్లు సమాచారం. దాంతో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ వస్తుందా రాదా..అనే టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత ఉన్నారు.


ఇంకా చెక్కాలన్నా! ( 'జక్కన్న' రివ్యూ)


ఇక ఇటీవల కాలంలో సునీల్‌ చేసిన చిత్రాలు అన్నటిలాగే.. సగటు మాస్‌ హీరోల సినిమాలకి ఏమాత్రం తగ్గని విధంగా ఇందులోనూ ఫైట్లు, పాటలు ఉన్నాయి. అయితే.. అందరూ సునీల్‌ నుంచి ఆశించే కామెడీనే లేకపోవటమే మైనస్ అయ్యింది. తెరపట్టనంత మంది నటులు.. పంచ్‌ డైలాగులు.. ప్రాసలు.. ఇలా దేనికీ లోటు లేని సినిమాలో కామెడీనే పండలేదు.


అయితే ఈ చిత్రంలో సునీల్‌ సరసన మన్నారా చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో...'స్వామీ నువ్వా అని హీరోయిన్‌ అంటే ఏం అద్నాన్‌ సమీ అనుకుంటున్నారా'.., 'ఒక్క సారి నేను సీన్‌లోకి ఎంటర్‌ అయినాకా రాసిన రైటర్‌కే డైలాగులుండవ్‌..
తొక్కి పారేస్తా'.. లాంటి సంభాషణలు ప్రేక్షకులకు నవ్వు తెప్పించే విధంగా ఉన్నాయి. వంశీ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


స్లైడ్ షోలో...ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ డిటేల్స్


నైజాం

నైజాం


'జక్కన్న' చిత్రం నైజాం ఏరియాకు 2.41 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందిసీడెడ్

సీడెడ్


'జక్కన్న' చిత్రం సీడెడ్ ఏరియాకు 1.26 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందిఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర


'జక్కన్న' చిత్రం ఉత్తరాంద్ర ఏరియాకు 0.75 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందిగుంటూరు

గుంటూరు


'జక్కన్న' చిత్రం గుంటూరు ఏరియాకు 0.60 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందికృష్ణా

కృష్ణా


'జక్కన్న' చిత్రం కృష్ణా ఏరియాకు 0.44 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందిఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి'జక్కన్న' చిత్రం ఈస్ట్ గోదావరి ఏరియాకు 0.63 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందివెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి


'జక్కన్న' చిత్రం వెస్ట్ గోదావరి ఏరియాకు 0.43 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందినెల్లూరు

నెల్లూరు'జక్కన్న' చిత్రం నెల్లూరు ఏరియాకు 0.29 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందిఎపి, నైజాం కలెక్షన్స్

ఎపి, నైజాం కలెక్షన్స్


'జక్కన్న' చిత్రం ఎపి, నైజాం కలిపి మొత్తం 6.81 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించింది కర్ణాటక

కర్ణాటక


'జక్కన్న' చిత్రం కర్ణాటక ఏరియాకు 0.62 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించింది


రెస్టాఫ్ ఇండియా

రెస్టాఫ్ ఇండియా


'జక్కన్న' చిత్రం రెస్టాఫ్ ఇండియా ఏరియా మొత్తం 0.20 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందివరల్డ్ వైజ్

వరల్డ్ వైజ్


'జక్కన్న' చిత్రం వరల్డ్ వైడ్ మొత్తం 7.63 కోట్లు ఫస్ట్ వీకెండ్ లో సాధించిందిEnglish summary
Inspite of the negative reviews, 'Jakkanna' generated good revenue in the Opening Weekend.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu