»   » సునీల్ ...రెండేళ్లు తర్వాత రిలీజ్ డేట్

సునీల్ ...రెండేళ్లు తర్వాత రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సునీల్ హీరోగా నటిస్తున్న సినిమా 'కృష్ణాష్టమి'. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారు అయ్యింది. చాలా కాలంగా డిలే అవుతూ వస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 5న విడుదల చేయటానికి నిర్ణయించారు. భీమవరం బుల్లోడు వచ్చి రెండేళ్లు అవుతోంది. అప్పటినుంచీ సునీల్ చిత్రం ఏదీ రిలీజ్ కాలేదు. ఇంతకాలానికి సునీల్ చిత్రం విడుదల తేదీ ఇవ్వటంతో అతని అభిమానుల ఆనందానికి అంతే లేదు.

ఇక రీసెంట్ గా ఈ చిత్రం దియోటర్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందీ ట్రైలర్ కు. ఈ సినిమాలో మంచి కామెడితో పాటు అన్నిరకాల హంగులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల మనసు దోచేయ్యడానికి సిద్ధం అవుతున్నాడు సునిల్. ఈ సినిమా ట్రైలర్ ని ఇక్కడ చూడండి.దిల్ రాజు మాట్లాడుతూ...ఆ అబ్బాయి అమెరికాలో చదువుకొన్నాడు. అక్కడే స్థిరపడ్డాడు. చాలా ఏళ్ల తరవాత భారతదేశంలో అడుగుపెట్టాడు. ‘పాపం కుర్రాడు చాలాకాలం తరవాత వచ్చాడు..' అని చూడకుండా సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. ఆ క్లిష్టపరిస్థితుల్నీ ఇష్టంగా స్వీకరించాడు. ఆ తరవాత ఏం జరిగిందో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు దిల్‌రాజు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘కృష్ణాష్టమి'.


దర్శకుడు మాట్లాడుతూ ‘‘చక్కటి కుటుంబ కథా చిత్రమిది. సునీల్‌ నుంచి ఏమేం కోరుకొంటారో ఆ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. వచ్చే నెల్లో చిత్రాన్ని విడుదల చేస్తాము'అన్నారు.


అలాగే..." మా బ్యానర్ లో వస్తోన్న మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం ఉంది. రాజమండ్రి లో 9న ఆడియో ని రిలీజ్ చేసి, చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో రిలీజ్ చేస్తాము", అని దిల్ రాజు అన్నారు.


Sunil’s Krishnashtami on Feb 5

ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 9 న రాజమండ్రి లో ని GIET కాలేజీ లో చాలా గ్రాండ్ గా చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు.


దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ, " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫమిల్య్ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".


Sunil’s Krishnashtami on Feb 5

సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.


దర్శకత్వం - స్క్రీన్‌ప్లే - వాసు వర్మ . నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - కోనా వెంకట్. ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.

English summary
Sunil starrer Krishnashtami will come to theatres on the 5th of February.
Please Wait while comments are loading...