హృతిక్ రోషన్ మూవీ ‘సూపర్ 30’ కలెక్షన్స్ పరిస్థితి ఎలా ఉందంటే?
'కాబిల్' మూవీ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఎట్టకేలకు 'సూపర్ 30' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గణితశాస్త్ర బోధకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 12న విడుదలై బాక్సాఫీసు వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ సాధించింది.
తొలి రోజు ఈ మూవీ ఇండియా వ్యాప్తంగా రూ. 11.83 కోట్లు వసూలు చేసింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజైన శనివారం వసూళ్లు పుంజుకున్నాయి. ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే కలెక్షన్స్ 50 శాతం పెరిగాయి. బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రెండో రోజు రూ. 18 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి వికాస్ బెహల్ దర్శకత్వం వహించారు. 'సూపర్ 30' కథ విషయానికొస్తే... ఆనంద్ కుమార్ 'సూపర్ 30' అనే ఐఐటీ ఇన్‌స్టిట్యూట్‌ను రన్ చేస్తూ ఏటా 30 మంది పేద విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారికి ఐఐటీలో సీటు దక్కేలా చేస్తున్నాడు. తన కెరీర్లో ఎంతో మంది పేదల ఐఐటి కల సాకారం చేసిన అతడి జీవితాన్నే సినిమాగా తీశారు.
హృతిక్ రోషన్ అనగానే మనకు కండలు తిరిగిన శరీరం, సూపర్ మ్యాన్ లాంటి కటౌట్ గుర్తుకు వస్తుంది. అయితే ఇందులో ఆయన పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది.


Click it and Unblock the Notifications











