»   » సుప్రీమ్, 24 కలెక్షన్స్ పరిస్దితి ఏంటి? ఏది కుమ్ముతోంది ?

సుప్రీమ్, 24 కలెక్షన్స్ పరిస్దితి ఏంటి? ఏది కుమ్ముతోంది ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూర్య తాజా చిత్రం 24 భీబత్సమైన ఓపినింగ్స్ తో ఓ రేంజిలో రిలీజ్ అయ్యింది. దానికి తగ్గట్లే ఈ చిత్రం మంచి రివ్యూలను సైతం సంపాదించుకుంది. అయితే కలెక్షన్స్ వైజ్ ...ఈ చిత్రం బి,సి సెంటర్లలలో సుప్రీమ్ నుంచి సమస్య ఎదుర్కొంటోందని సమాచారం.

సిటిల్లో ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లు, ఎ సెంటర్లలలో ఈ సినిమా ధియోటర్స్ హౌస్ ఫుల్స్ అయ్యాయి. కానీ బి,సి సెంటర్లలలో ఈ చిత్రం హవా కనపడటం లేదు. అదే సుప్రీమ్ విషయానికి వచ్చేసరికి బి,సి సెంటర్లలలో బాగా వర్కవుట్ అవుతోందని సమాచారం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో కూడా సుప్రీమ్ కు వీకెండ్ లో బాగానే కలెక్ట్ చేసిందని సమాచారం.


ఇక 24కు అంత టాక్ వచ్చినా కలెక్షన్స్ కొద్దిగా డ్రాప్ అవటానికి కారణం..సినిమాకు తగ్గ ప్రమోషన్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో లేదని వినపడుతోంది. అదే సుప్రీమ్ విషయానికి వచ్చేసరికి...దిల్ రాజు.. సినిమాని ప్రమోట్ చేయటంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దాంతో 24 కన్నా పెద్ద సినిమాగా భాక్సాఫీస్ వద్ద కనపడుతోంది.


Suriya’s 24 got Sai dharma teja's supreme shock?

దానికి తోడు... 24 కు హీరో సూర్య కావటం, సుప్రీమ్ కు ఇక్కడ లోకల్ హీరో సాయి ధరమ్ తేజ కావటం కూడా కలిసి వచ్చే అంశం. సాయి ధరమ్ తేజ ఇప్పుడిప్పుడే మాస్ లోకి దూసుకువెళ్తున్నాడు. అతనికి మెగా ఫ్యాన్స్ అండ,దండ కూడా ఉండటం ప్లస్ అయ్యింది.


సూర్య కు ఇక్కడ వరస ఫ్లాఫ్ లు ఉండటం, సైన్స్ ఫిక్షన్ కధాంశం కావటం మైనస్ లుగా మారాయి. కానీ సిటీల్లో మాత్రం 24 దుమ్మురేపుతోంది. అడ్వాన్స్ బుక్కింగ్ లతో బాగా కలెక్టు చేస్తోంది. మొదటి రోజు కలెక్షన్స్ అయితే తమిళనాడు కన్నా ఇక్కడా ఎక్కువ తెచ్చి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

English summary
Suriya’s 24 film took a slight jolt near box office. Although the collection in A centers and multiplexes are decent but the collections in the mass belts has became big head ache.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X