Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సైరా కలెక్షన్ల రికార్డులు: రిలీజ్‌కు ముందే ఊచకోత.. టికెట్ కొంటే టికెట్ ఫ్రీ
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహరెడ్డి సినిమాకు ఓవర్సీస్‌లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌కు రికార్డు స్థాయిలో రెస్సాన్స్ లభిస్తున్నది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. అక్టోబర్ 1వ తేదీ వరకు ముందస్తు బుకింగ్ సంబంధించిన వసూళ్లతోనే వాారాంతానికి 5 మిలియన్ల డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశం కనిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే..

యూఎస్‌లో సైరా
సైరా అక్టోబర్ 2వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. యూఎస్‌ఏలో 10 రోజుల ముందుగానే సుమారు 120కి పైగా స్క్రీన్లలో అడ్వాన్సు బుకింగ్ ప్రారంభించారు. మంగళవారమే ప్రీమియర్లు ప్రదర్శిస్తుండటంతో అభిమానులు టికెట్ల కొనుగోలుకు పోటెత్తుతున్నారు. అంతేకాకుండా యూఎస్‌లో ఏటీ అండ్ టీ సంస్థ ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితంగా ఇస్తుండటంతో ఫ్యాన్స్ ముందే టికెట్ రిజర్వు చేశారు.

200 లొకేషన్లలో 775 షోలు
సైరా అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తుండటంతో సోమవారం మరో 160 స్క్రీన్ల కోసం అడ్వాన్స్ బుకింగ్‌ను ఏర్పాటు చేసింది. యూఎస్‌లో 199 లొకేషన్లలో 774 షోలు ప్రదర్శించనున్నారు. శనివారం వరకు అందిన వివరాల ప్రకారం $337,875 అడ్వాన్సు బుకింగ్ రూపేణ వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రికార్డు దిశగా ప్రయాణిస్తుందనే విషయం స్పష్టమవుతున్నది.

దండిగా వసూళ్లు
యూఎస్‌లో ఇప్పటికే పలు సంస్థలు అడ్వాన్స్ బుకింగ్‌ను జారీ చేశాయి. అడ్వాన్సు రూపంలో సినీ మార్క్ 190,000 డాలర్లు, ఏఎంసీ 50 వేలకు పైగా డాలర్లు, రీగల్ 6 వేల డాలర్లు, మార్కస్ 20 వేల డాలర్లు, హర్కిన్స్ 17 వేల డాలర్లు, ఎమాజిన్ 16 వేల డాలర్లు, ఇతరుల 50 వేల డాలర్లు కలెక్ట్ చేశాయి.

ఇప్పటికే ప్రింట్లు అమెరికాకు..
ఇక సైరా ఓవర్సీస్ ప్రింట్లు ఆదివారం వరకే అమెరికాకు చేరుకొన్నాయి. కంటెంట్ టైమ్‌కే చేరుకొన్నది. హార్డ్ డిస్కులు అన్ని సెంటర్లకు చేరాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రీమియర్లు ప్రదర్శిస్తారు. అన్ని స్క్రీన్ల వద్ద అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలో దసరాకు వారం ముందే పండుగ కళ వచ్చేసింది అని ట్రేడ్ అనలిస్టు దీపుతోపాటు పలువురు ట్వీట్లు చేస్తున్నారు.