twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ చరిత్రలో అరుదైన రికార్డు.. సైరా ఎన్నో స్థానంలో అంటే

    |

    భారతీయ సినిమా పరిశ్రమలో అక్టోబర్ రెండో తేదీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. సెలవు రోజున హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ చిత్రం, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రాలు భారీగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాగే ఈ భారీ పోటీ నడుమ జోకర్ సినిమా కూడా విడుదలైంది. అయితే ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ను కుమ్మేశాయి. ఇవి తొలి రోజు మొత్తంగా చేసిన వసూళ్లు ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ మైలురాయిగా నిలిచాయి.

    తొలి రోజున ఇండియన్ సినీ రంగంలో

    తొలి రోజున ఇండియన్ సినీ రంగంలో

    తొలిరోజున సైరా, వార్ సినిమాలు ప్రపంచవ్యాపంగా హల్ చల్ చేశాయి. సైరా ప్రపంచవ్యాప్తంగా 53.72 కోట్ల నెట్, రూ.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడితే.. వార్ చిత్రం 53.35 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఇక జోకర్ చిత్రం 7 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారు రూ.145 కోట్ల వరకు వసూలు చేసింది. ఇలా ఓ రోజు రూ.100 కోట్లు వసూలు చేయడం సినీ పరిశ్రమలో అరుదుగా జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    దక్షిణాది చిత్రాల జోరు

    దక్షిణాది చిత్రాల జోరు

    ఇక భారతీయ సినిమా పరిశ్రమలో దక్షిణాది చిత్రాలు ప్రపంచ బాక్సాఫీస్ వద్ద తొలి రోజు సందడి ఇలా ఉంది. బాహుబలి ఏకంగా రూ.214 కోట్లు వసూలు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ తర్వాత వచ్చిన సాహో చిత్రం రెండో స్థానంలో నిలిచింది. తొలిరోజు వచ్చిన మిక్స్‌డ్ టాక్‌ను అధిగమించి రూ.127 కోట్లు రాబట్టింది. ఇక శంకర్, రజనీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన 2.0 చిత్రం రూ.94 కోట్లు రాబట్టి 4వ స్థానంలో నిలిచింది.

    సైరా 5వ స్థానంలో

    సైరా 5వ స్థానంలో

    ఇక నాలుగో స్థానంలో రూ.88 కోట్లతో కబాలి నిలువగా, రూ.82 కోట్లతో సైరా చిత్రం 5వ స్థానంలో నిలిచింది. ఇక బాహుబలి1 73 కోట్లతో 6వ స్థానంలో, సర్కార్ చిత్ర్ం రూ.67 కోట్లతో 7వ స్థానంలో నిలిచాయి. అట్టర్ ఫ్లాప్‌ టాక్‌తో కూడా అజాతవాసి చిత్రం తొలి రోజున 61 కోట్లు సాధించి 8వ, అరవింద సమేత రూ.58 కోట్లతో 9వ స్థానంలో, భరత్ అనే నేను రూ.54 కోట్లతో 10వ స్థానంలో స్థిరపడింది.

    బాలీవుడ్‌ను శాసిస్తున్న సైరా

    బాలీవుడ్‌ను శాసిస్తున్న సైరా

    గత కొన్నేళ్లుగా భారతీయ సినిమా పరిశ్రమలో దక్షిణాది చిత్రాలు సత్తా చాటుతున్నాయి. పలు చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తున్నది. కొన్ని చిత్రాలు హిందీలో రీమేక్ కాబడి మంచి ఘనవిజయాన్ని అందుకొన్నాయి. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ సౌత్ సినిమా బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. ఈ క్రమంలో బాహుబలి ఇప్పటికే చరిత్ర సృష్టించగా, సైరా చిత్రం బాక్సాఫీస్‌ను నిర్దేశం చేసేందుకు పరుగులు పెడుతున్నది.

    English summary
    Megastar chiranjeevi syera movie released on October 2nd. The movie doing business extrodinary at box office. World wide movie collected 85 crores gross.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X