»   » రిలీజైన నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి(ట్రేడ్ టాక్)

రిలీజైన నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి(ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ వారం రెండు తెలుగు చిత్రాలతో పాటు మరో రెండు డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయ. అవి తనీష్ హీరోగా అందాల రాముడు డైరక్టర్ దీప్తి రూపొందించిన'మంచివాడు" , శివాజీ కన్నడ రీమేక్ 'లోకమేకొత్తగా...", శ్రీకాంత్ డబ్బింగ్ చిత్రం 'అమెరికా అల్లుడు", మరో మళయాళి డబ్బింగ్ చిత్రం 'లంకేశ్వరి".వీటిల్లో ఏదీ యావరేజ్ టాక్ తెచ్చుకోలేకపోయింది.ముఖ్యంగా సూపర్‌గుడ్ మూవీస్ సంస్థ వంటి పెద్ద బ్యానర్‌లో వచ్చిన చిత్రం పై కొద్దో గొప్పో ఆశలు ఉన్నాయి.తనీష్ హీరోగా వచ్చిన ఈ 'మంచివాడు"చిత్రం మరీ పూర్వకాలం నాటి కథాశంతో వచ్చింది.ఇలాంటి చిత్రాలు ఎనభైల్లో చాలా వచ్చాయి.అవన్నీ ఇప్పుడు టీవీల్లో రావటంతో ఈ సినిమాను ఎందుకుచూడాలని జనం ధియోటర్స్ కు రావటం లేదు.ఇక శివాజీ 'లోకమేకొత్తగా..."లో ఏ మాత్రం కొత్తదనం లేక చెత్తగా తయారై బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. శ్రీకాంత్ 'అమెరికా అల్లుడు" తెలుగులో నాగార్జునహీరోగా వచ్చిన 'సంతోషం" చిత్రానికి కన్నడ రీమేక్‌కు తెలుగు డబ్బింగ్.మరో డబ్బింగ్ చిత్రం 'లంకేశ్వరి"రిలీజైన విషయం కూడా ఎవరికీ తెలియకుండా పోయింది.

English summary
Tanish's Manchivadu,sivaji's Lokame Kottataga, Srikanth's America Alludu, lankeswari films' released last week with Flop talk
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu