Telusu Kada Day 1 Collections: తెలుసు కదా కలెక్షన్లు ఎంత? సిద్దూ జొన్నలగడ్డ హిట్టా? ఫట్టా?
తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం తెలుసు కదా. రొమాంటిక్, మ్యూజికల్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ క్యాస్టూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి డైరెక్టర్‌గా మారారు.
రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ మిక్స్ చేసి రూపొందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫి, నవీన్ నూలీ ఎడిటింగ్, ఎస్ థమన్ మ్యూజిక్ అందించారు. థమన్ అందించిన పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీ 2025 సంవత్సరం రోజున రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్లు వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే..

తెలుసు కదా సినిమాను ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగారు. ఈ చిత్రంలోని నటీనటులు రెమ్యునరేషన్, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారుగా 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. సిద్దూ జొన్నలగడ్డ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. సిద్దూ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి లాంటి క్రేజీ కాంబినేషన్ ఉండటంతో ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ భారీగా అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 16 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ 8 కోట్లు, మ్యూజిక్ రైట్స్ 1.5 కోట్ల రూపాయల మేర జరిగింది. మొత్తంగా 25.5 కోట్ల రూపాయలు నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
సిద్దూ జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా డిజాస్టర్ కారణంగా తెలుసు కదా సినిమా థియేట్రికల్ రైట్స్‌కు అంతగా క్రేజ్ కనిపించలేదనేది ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ సినిమా బిజినెస్ సుమారుగా 12 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ 30 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేస్తే సూపర్ హిట్ టాక్ వచ్చే అవకాశం ఉంది అని ట్రేడ్ నిపుణులు పేర్కొన్నారు.
తెలుసు కదా చిత్రం రిలీజ్ తర్వాత ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ సినిమాకు తొలి రోజు అంతంత మాత్రంగానే ఆక్యుపెన్సీ కనిపించింది. తొలి రోజు ఈ సినిమా సుమారుగా 30 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. ఈ చిత్రం తొలి రోజు 2 నుంచి 3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. భారీగా వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











