Telusu Kada Day 3 Collections: తెలుసు కదా షాకింగ్ కలెక్షన్స్.. సిద్దూ మూవీకి 3 రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

Telusu Kada Collections:దీపావళి పండుగ సందర్భంగా రిలీజైన చిత్రాల్లో "తెలుసు కదా"(Telusu Kada) కూడా ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారిగా దర్శకత్వం వహించారు. స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించగా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా కనిపించారు. అక్టోబర్ 17న రిలీజైన తెలుసు కదా మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్లు వసూలు చేసింది. సిద్దూ మూవీ 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

రొమాంటిక్, మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ వ్యాల్స్ మిళితం ఉన్నాయి. శ్రీనివాస్ రెడ్డి, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలీ ఎడిటింగ్, ఎస్. థమన్ సంగీతం అందించారు. థమన్ అందించిన పాటలు సోషల్ మీడియాలో హిట్ అయ్యి, సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ చేశాయి.

Telusu Kada Day 3 Collections

'తెలుసు కదా'సినిమాకు దాదాపు రూ. 35 కోట్ల బడ్జెట్ ఖర్చైనట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. ఇందులో నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులు కూడా ఉన్నాయి. ఇక ప్రి బిజినెస్ విషయానికి వస్తే.. సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్ వివరాల ప్రకారం ఓటీటీ రైట్స్ రూ. 16 కోట్లు, శాటిలైట్ రైట్స్ రూ. 8 కోట్లు, మ్యూజిక్ రైట్స్ రూ.1.5 కోట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది.
ఇలా మొత్తంగా రూ. 25.5 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ అయింది. అయితే థియేట్రికల్ బిజినెస్ మాత్రం సుమారు రూ. 12 కోట్ల వరకు మాత్రమే జరిగింది. సినిమా బ్రేక్‌ఈవెన్ సాధించాలంటే కనీసం ₹25 కోట్ల గ్రాస్ వసూళ్లు అవసరమని ట్రేడ్ విశ్లేషకులు తెలిపారు.

ఫస్ట్ డే ఓపెనింగ్స్
తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ ఓపెనింగ్స్ పరంగా అంతగా దుమ్మురేపలేకపోయింది. మొదటి రోజు దేశవ్యాప్తంగా సినిమా రూ. 2.1 కోట్ల నెట్ కలెక్షన్ సాధించగా, గ్రాస్ కలెక్షన్ సుమారు రూ. 3.25 కోట్ల వరకు నమోదైంది. సిద్ధూ జొన్నలగడ్డ లాస్ట్ మూవీ జాక్ (Jack) ఫ్లాప్ కావడంతో, ఈసారి థియేట్రికల్ మార్కెట్‌లో అంత బజ్ కనిపించలేదు. అయినా మంచి మౌత్‌టాక్ వస్తే పిక్-అప్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

రెండో రోజు పరిస్థితి
తెలుసుకదా రెండో రోజు సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. మొదటి రోజు కంటే ఆక్యుపెన్సీ తక్కువగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు రూ. 1.12 కోట్లు షేర్ రాబట్టగా, దేశవ్యాప్తంగా రూ. 1.84 కోట్ల నెట్ కలెక్షన్ అందుకుంది. ఓవర్సీస్‌లో మాత్రం పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. అమెరికాలో రెండో రోజు టికెట్ సేల్స్ రూ. 33 వేల డాలర్ల వరకు నమోదయ్యాయి. ఇక రెండో రోజు వరకు మొత్తం వరల్డ్‌వైడ్ కలెక్షన్లు రూ. 3.76 కోట్లు షేర్, రూ. 7.15 కోట్ల గ్రాస్ వరకు చేరుకున్నట్లు ట్రేడ్ ట్రాకర్స్ లెక్కలు చెబుతున్నాయి.

మూడో రోజు కలెక్షన్స్
మూడో రోజు (సండే) "తెలుసు కదా" కలెక్షన్లు గణనీయంగా పడిపోయాయి. సాక్‌నిక్ లైవ్ డేటా ప్రకారం.. దేశవ్యాప్తంగా మూడో రోజు సినిమా మధ్యాహ్నం వరకు రూ.1. 36 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఫస్ట్ షో, సెకండ్ షోలో కలెక్షన్స్ పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ అంచనాల ప్రకారం.. నేడు దేశవ్యాప్తంగా సినిమా రూ. 1.2 కోట్ల నెట్ కలెక్షన్ సాధించగా, గ్రాస్ కలెక్షన్ సుమారు రూ. 1.8 కోట్ల నుంచి రూ. 2 కోట్ల వరకు నమోదు చేసే అవకాశముందట. ఇలా మూడవ రోజు కలెక్షన్లు మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ రూ5 .3 కోట్లు (సుమారు రూ 5.7 కోట్ల గ్రాస్) అందుకునే అవకాశముందట.

సినిమా పాజిటివ్ రివ్యూస్ సాధించకపోవడంతో మౌత్‌టాక్ మిక్స్ గా ఉంది. ప్రత్యేకంగా యువ ప్రేక్షకులకే మాత్రమే సినిమా కాస్త కనెక్ట్ అయ్యింది. అదే సమయంలో డ్యూడ్, కాంతార చాప్టర్ 1 వంటి సినిమాలు కూడా థియేటర్లలో పోటీలో ఉండటంతో, "తెలుసు కదా"కి స్క్రీన్ కౌంట్, ఆక్యుపెన్సీ మీద ప్రభావం పడింది. అలాగే.. సినిమాలో సిద్ధూ జొన్నలగడ్డ పోషించిన వరుణ్ పాత్ర జీవితం, ప్రేమ, కుటుంబ విలువలు, సంబంధాల మధ్య జరుగుతున్న సంఘటనలతో నడుస్తుంది. రొమాంటిక్ ఎమోషనల్ స్టోరీగా నడిచిన ఈ సినిమా, మల్టీ లేయర్ నారేటివ్ వల్ల అందరికీ ఈ సినిమా కనెక్ట్ కాలేకపోయింది. రానున్న రోజుల్లో తెలుసు కదా మూవీ ఎలాంటి వసూలు రాబడుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X