»   » ‘టెంపర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

‘టెంపర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతోంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) సూపర్ కలెక్షన్లు సాధించింది. ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో ఈచిత్రం రూ. 17.67 కోట్లు వసూలు చేసింది. మరో వైపు పక్కరాష్ట్రం కర్ణాటకలోనూ రికార్డు స్థాయిలో తొలి మూడు రోజుల్లో రూ. 3 కోట్లు వసూలు చేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


తమిళనాడులో ధనుష్ నటించిన ‘అనేగన్', అజిత్ నటించిన ‘ఎన్నై అరిందాల్' చిత్రాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సమయంలోనూ ‘టెంపర్' అక్కడ మంచి వసూలు రాబట్టింది. తొలి రెండు రోజుల్లో అమెరికాలో 690000 డాలర్లు వసూలు చేసింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 24 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది.


Temper First Weekend Collections

మరో వైపు ఓపెనింగ్ డే ఈ చిత్రం రూ. 9.68 కోట్ల షేర్ వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన మూడో సినిమాగా రికార్డుల కెక్కింది. రూ. 10.75 కోట్ల వసూళ్లతో ‘అత్తారింటికి దారేది' చిత్రం మొదటి స్థానంలో ఉండగదా, రూ. 9.74 కోట్లతో ‘దూకుడు' రెండో స్థానంలో ఉంది.


ఎన్టీఆర్, కాజల్, ప్రకాష్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జి, వెన్నెల కిషోర్‌, జయప్రకాష్‌రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమాప్రభ, పవిత్ర లోకేష్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ: వక్కంతం వంశీ, కెమెరా: శ్యామ్‌ కె నాయుడు, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఆర్ట్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఫైట్స్‌: విజయ్‌, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్‌, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

English summary
‘Temper’ has collected close to 24 crores in its first weekend and the film is expected to do a strong business this week as well.
Please Wait while comments are loading...