Just In
- 4 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 4 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 5 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 6 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
విజయ్ విజిలేస్తే దిమ్మతిరిగే క్రేజ్.. రికార్డు బిజినెస్.. షాకింగ్‌గా ఫస్ట్‌డే వసూళ్లు!
తమిళ సూపర్‌స్టార్ విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో సెన్సేషనల్‌గా రూపొందిన విజిల్ (బిగిల్) చిత్రం విడుదలకు సిద్ధమైంది. తమిళనాడులోనే కాకుండా తెలుగులో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, తొలి రోజు సాధించే కలెక్షన్లు, ఎన్ని థియేటర్లలో రిలీజ్ అనే అంశాలు ఆసక్తిగా మారాయి. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత మహేష్ కోనేరు విడుదల చేస్తున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు మీకోసం..

డబ్బింగ్ చిత్రాల్లోనే టాప్
టాలీవుడ్ డబ్బింగ్ చిత్రాల చరిత్రలో విజిల్ చిత్రం ప్రత్యేకతను సంతరించుకొన్నది. ఇప్పటి వరకు తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ అయిన చిత్రాల్లో ఇది అతిపెద్ద రిలీజ్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగులో ఇప్పటి వరకు విజయ్ కెరీర్‌లో ఎన్నడూ లేనంతగా ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది.

తెలుగు రాష్ట్రాల ట్రేడ్ రిపోర్టు
ఇక ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం. విజిల్ థియేట్రికల్ రైట్స్ భారీ ఎత్తున జరిగాయి. నైజాంలో 3 కోట్లు (అడ్వాన్ పద్దతిలో), సీడెడ్‌లో రూ.2.25 కోట్లు, ఆంధ్రాలో రూ.4.5 కోట్లు (రేషియో)గా జరిగాయి. మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.10 కోట్ల మేర థియేట్రికల్ హక్కుల బిజినెస్ జరిగింది. ఇది విజయ్ కెరీర్‌లో హయ్యెస్ట్‌గా పేర్కొంటున్నాయి.

వరల్డ్ వైడ్ ట్రేడ్ రిపోర్టు
ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో 83.55 కోట్లు, ఏపీ, తెలంగాణలో రూ.10 కోట్లు, కర్ణాటకలో రూ.8.5 కోట్లు, కేరళలో రూ.3.5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.1 కోటి మేర బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్‌లో అన్ని భాషల్లో కలిపి రూ.30 కోట్ల మేర జరిగాయి. ఇక దేశవ్యాప్తంగా రూ.108 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 138.55 కోట్ల మేర బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఫస్ట్ డే కలెక్షన్ల అంచనా
ఇక తెలుగు రాష్ట్రాల్లో విజిల్ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. నైజాం, ఏపీలో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అవుతుండటంతో రికార్డు ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరిగింది. తొలి రోజు రూ.3 కోట్లకుపైగా వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

విజయ్ క్రేజ్ అంటే అదీ
విజిల్ సినిమా భారీ క్రేజ్ ఉందని చెప్పడానికి హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో 50 అడుగు కటౌట్ పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లోని థియేటర్లలో కూడా రిలీజ్ అవుతున్నది. ఉత్తరాంధ్రలో 179 స్క్రీన్లలో, నైజాంలో 275 స్క్రీన్లలో రిలీజ్ అవుతున్నది.