twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    The Kashmir Files : పెద్ద సినిమాలను చిత్తు చేస్తూ ముందుకు.. సోమవారం కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్

    |

    'ది కాశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ వద్ద పెను తుఫాను సృష్టిస్తోంది. కాశ్మీరీ పండిట్ల వలసల గురించి తీసిన ఈ సినిమా కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. సాధారణంగా, మొదటి సోమవారం సినిమాల వసూళ్లు సాధారణంగా నమోదయ్యే చోట, వివేక్ అగ్నిహోత్రి ' ది కాశ్మీర్ ఫైల్స్' వసూళ్లు సోమవారం మొదటి రోజుతో పోలిస్తే 5 రెట్లు పెరిగాయి. అవును, ఫస్ట్ సోమవారం టెస్టులో ఈ సినిమా చరిత్ర సృష్టించింది. 'ది కాశ్మీర్ ఫైల్స్' సోమవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంత రాబట్టింది అనేది చూద్దాం.

    స్క్రీన్‌లు మూడు రెట్లు.. ఆదాయాలు 5 రెట్లు

    స్క్రీన్‌లు మూడు రెట్లు.. ఆదాయాలు 5 రెట్లు

    ఈ సినిమా చిత్రం శుక్రవారం, మార్చి 11, 2022న దేశవ్యాప్తంగా 700 స్క్రీన్‌లలో విడుదలైంది. అయితే ప్రేక్షకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ఆదివారం నుంచి స్క్రీన్ ల సంఖ్య 2000కు పైగా పెంచారు. సహజంగానే సినిమాపై క్రేజ్ పెరిగి స్క్రీన్‌ల సంఖ్య పెరిగినప్పుడు వసూళ్లు కూడా పెరుగుతాయి. దేశంలోని పెద్ద నగరాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అయితే, ఆదివారంతో పోలిస్తే టైర్-2, టైర్-3 నగరాల్లో సోమవారం ఆదాయం తగ్గింది.

    చరిత్ర సృష్టించే దిశగా

    చరిత్ర సృష్టించే దిశగా


    అయితే ఎలా చూసినా సోమవారం సినిమా వసూళ్లు పెరగడం రికార్డు అనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఏ మంచి సినిమా అయినా తొలి రోజుతో పోలిస్తే తొలి సోమవారం 30-35 శాతం వసూళ్లు నమోదు అవుతాయి. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, సూరత్‌లో ఈ చిత్రం మంచి బిజినెస్‌ చేసింది. 'ది కాశ్మీర్ ఫైల్స్' బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతోంది. 1975లో విడుదలైన ' జై సంతోషి మా ' తర్వాత చిన్న బడ్జెట్‌తో విడుదలైన ఈ చిత్రం వసూళ్ల పరంగా అందరినీ ఆశ్చర్యపరిచింది.

    సినిమా మీద ప్రశంసలు

    సినిమా మీద ప్రశంసలు

    ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది. రెండో వర్కింగ్ డే అంటే మంగళవారం వసూళ్లు చూస్తే ఈ వారంలో సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. సోమవారం నాడు రూ.15 కోట్లు రాబట్టింది. ఈ విధంగా నాలుగు రోజుల్లో సినిమా మొత్తం వసూళ్లు రూ.41.50 కోట్లకు చేరాయి. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి మరియు దర్శన్ కుమార్ నటించిన 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రం కాశ్మీరీ పండిట్ల వలస కథలు ఆధారంగా రూపొందించబడింది. బాలీవుడ్‌లో కంగనా రనౌత్ నుండి యామీ గౌతమ్ వరకు, ఈ సినిమా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

    పన్ను మినహాయింపు

    పన్ను మినహాయింపు

    వసూళ్లు ఇలా పెరిగాయి - శుక్రవారం నాడు రూ. 3.25 కోట్లు (700 స్క్రీన్లు) శనివారం - రూ. 8.25 కోట్లు (700 స్క్రీన్లు) ఆదివారం - రూ. 15 కోట్లు (2000+ స్క్రీన్లు ) సోమవారం - నాలుగు రోజుల్లో రూ. 15 కోట్లు (2000+ స్క్రీన్లు) అలా మొత్తం నాలుగు రోజులకు గాను రూ.41.50 కోట్లు సంపాదించింది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రానికి పన్ను మినహాయింపు లభించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

    పాండమిక్ తరువాత

    పాండమిక్ తరువాత


    పాండమిక్ అనంతర కాలంలో 4వ రోజు టాప్ 4 స్కోరర్ సినిమాలు ఈ మేరకు ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్: ₹ 15.05 కోట్లు, సూర్యవంశీ: ₹ 14.51 కోట్లు, గంగూబాయి కతియావాడి: ₹ 8.19 కోట్లు, 83 సినిమా: ₹ 7.29 కోట్లుగా ఉండగా కోవిడ్‌కు ముందు తాన్హాజీ: ₹ 13.75 కోట్లు, ఉరి: ₹ 10.51 కోట్లు సంపాదించాయి. వాటన్నిటి కంటే ఈ సినిమా బాగా వసూలు చెప్పింది.

    Recommended Video

    Nathicharami: నాతిచరామి టైటిల్ లోనే చాలా ఎమోషన్ ఉంది అక్కడే కనెక్ట్ అయిపోయారు | Filmibeat Telugu
    చాలా రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీ

    చాలా రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీ

    ఇంతకు ముందు ఈ సినిమా చాలా రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీ గా ప్రకటించింది. కశ్మీరీ పండిట్‌ల పట్ల కాశ్మీరీ సమాజనం అసభ్యంగా ప్రవర్తించిన తీరును ఈ చిత్రంలో చూపించారు. యూపీతో పాటు మధ్యప్రదేశ్, హర్యానా తర్వాత గుజరాత్‌లో కూడా 'కశ్మీర్ ఫైల్స్' చిత్రానికి పన్ను మినహాయింపు లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ది కాశ్మీర్ ఫైల్ కు టాక్స్ ఫ్రీ అని ప్రకటించారు. ఇక ఇండోర్‌లో అయితే బీజేపీ అధికార ప్రతినిధి ఉమేష్ శర్మ సినిమాను ప్రజలు చూపించేందుకు థియేటర్ మొత్తాన్ని బుక్ చేశారు.

    English summary
    The Kashmir Files hits the screens on March 11th. Here is the complete day 3 collection and box office report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X