The Raja Saab Business: ది రాజా సాబ్‌కు రికార్డ్ బిజినెస్? ఆంధ్రా, నైజాంలలో ప్రభాస్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

గడిచిన కొన్నేళ్లుగా యాక్షన్, మాస్ మసాలా సినిమాలు చేస్తూ వస్తున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. అయితే ఆయన అభిమానులు మాత్రం వింటేజ్ ప్రభాస్‌ను చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు చేసిన హిస్టరీ ప్రభాస్‌కి ఉంది. ఈ నేపథ్యంలోనే మాస్ యాక్షన్ సినిమాలకు విరామం ప్రకటించిన ప్రభాస్... కామెడీ, కుటుంబ కథా చిత్రాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాయే ది రాజా సాబ్. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లతో రాజా సాబ్‌పై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లుగానే ప్రభాస్ మూవీకి బిజినెస్ జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ది రాజా సాబ్ బడ్జెట్ ఎంత?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనాలు.. ది రాజా సాబ్ చిత్రాన్ని దాదాపు 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, బోమన్ ఇరానీ, జరీనా వహబ్, సముద్రఖని, బ్రహ్మనందం, వీటీవీ గణేష్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రాఫర్‌‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తొలుత ఈ ఏడాది డిసెంబర్ 5న ది రాజా సాబ్‌ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

The Raja Saab AP TG Theatrical Business Prabhas Movie breakeven Target for the Telugu version in Andhra and Telangana

ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ బిజినెస్
పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ మార్కెట్ నేపథ్యంలో ది రాజా సాబ్ ఇంకా సెట్స్ మీద ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ వెర్షన్‌లకు వేరు వేరుగా బిజినెస్‌ డీల్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ది రాజా సాబ్ ఓటీటీ రైట్స్ కోసం పోటీ
ఇప్పటికే ది రాజా సాబ్ డిజిటల్ రైట్స్‌ను హిందీకి, దక్షిణాది భాషలకు వేర్వేరుగా ఓటీటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా ఫిలింనగర్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగా ది రాజా సాబ్ హిందీ రైట్స్‌‌కు రికార్డు ధర పలికినట్లుగా చెబుతున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 100 కోట్లకు పైగా వెచ్చించి ది రాజా సాబ్ హిందీ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోవాలని బేరసారాలు సాగిస్తున్నట్లుగా మొన్నామధ్య వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా టాక్ ప్రకారం ది రాజా సాబ్ దక్షిణాది భాషల ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ ముందు భారీ టార్గెట్?
థియేట్రికల్ బిజినెస్ కూడా ఇదే స్థాయిలో జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రత్యేకించి ప్రభాస్‌కు భారీ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న ఆంధ్రా, నైజాంలలో ది రాజా సాబ్ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం పంపిణీదారుల మధ్య భారీగా పోటీ జరుగుతోందట. దీని ప్రకారం ది రాజా సాబ్ తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి రావాలంటే 200 కోట్ల రూపాయలు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Read more about: the raja saab prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X