twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'Forbes 100' లిస్ట్ లో మహేష్,పవన్, ఎన్టీఆర్ స్దానాలేమిటి?!

    By Srikanya
    |

    న్యూయార్క్‌ : భారతదేశం మొత్తం మీద ఎక్కువ ప్రభావవంతమైన,సంపర్నలైన వంద మంది సెలబ్రేటీలను 'ఫోర్బ్స్' పత్రిక ఎంపిక చేసింది. సాధారణంగా ఈ స్ధానాల్లో మొదటి పదిమందిని ప్రపచం పట్టించుకుని గుర్తింస్తుంది. అయితే ఇప్పుడు తెలుగు హీరోలు ఈ లిస్ట్ లోకి చేరటంతో ఈ లిస్ట్ ఇక్కడ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

    ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితాలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ టాప్-20లో చోటు దక్కించుకున్నారు. 'ఫోర్బ్స్' పత్రిక రూపొందించిన ఈ వార్షిక జాబితాలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలువడం విశేషం.

    దాదాపు 710 కోట్ల జనాభా కలిగిన ప్రపంచాన్ని సజావుగా ముందుకు నడుపుతున్న 71 దేశాల అధినేతలు, సిఇఓలు, మానవతా వాదులతో కూడిన ఈ జాబితాలో భారత్‌లో అత్యంత సంపన్నవంతుడైన పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆర్సెలార్ మిట్టల్ సంస్థ సిఇఓ లక్ష్మీ మిట్టల్ కూడా ఉన్నారు. ఈ జాబితాలో గత ఏడాది 11వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తాజా జాబితాలో ఒక స్థానం కిందికి జారి 12వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో సోనియా చైనా ఉప ప్రధాన మంత్రి లీ కెక్వియాంగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేల కంటే ముందున్నారు.

    ఇక మన తెలుగు హీరోల విషయానికి వస్తే...

    మహేష్ బాబు

    ర్యాంక్ - 31; మొత్తం 2012 లో ఆదాయం - Rs 42.25 కోట్లు ; మనీ ర్యాంక్ - 15; ఫేమ్ ర్యాంక్ - 79.

    రవితేజ

    ర్యాంక్ - 50; మొత్తం 2012 లో ఆదాయం - Rs 15.5 కోట్లు ; మనీ ర్యాంక్ - 38; ఫేమ్ ర్యాంక్ - 56.

    పవన్ కళ్యాణ్

    ర్యాంక్ - 53; 2012 లో ఆదాయం - Rs 26.33 కోట్లు; మనీ ర్యాంక్ - 24; ఫేమ్ ర్యాంక్ - 85.

    నాగార్జున

    ర్యాంక్ - 56; 2012లో ఆదాయం - Rs 11.79 కోట్లు; మనీ ర్యాంక్- 50; ఫేమ్ ర్యాంక్ - 55.

    జూ,ఎన్టీఆర్

    ర్యాంక్ - 66; 2012 లో మొత్తం ఆదాయం - Rs 19 కోట్లు; మనీ ర్యాంక్ - 31; ఫేమ్ ర్యాంక్ - 91.

    English summary
    
 Forbes released the list of India's Top 100 powerful celebrities. The rating were given based on their earnings and fame. Bollywood superstar
 Shahrukh Khan topped the list with a Total Earnings of Rs 202.8 crore (including both films and endorsements) in 2012 and fame rank of 3.Here is the list of Tollywood Heroes in Forbes India Celebrity 100 List.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X