twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏది చూస్తున్నారు? : ఈ వారం తెలుగు రిలీజ్ లు (ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఈ వారాంతం మన బాక్సాఫీసు నాలుగు చిత్రాలతో కళకళలాడబోతోంది. రెండు ప్రేమకథలు, ఒక హార్రర్‌కామెడీ, మరో సందేశాత్మక చిత్రం కలిసి థియేటర్లను హోరెత్తించబోతున్నాయి.

    కొత్త సినిమా సందడి లేని శుక్రవారం అరుదనే చెప్పాలి. తెలుగులో ప్రతీవారం ఏదో ఒక చిత్రం విడుదలవుతూనే ఉంటుంది. ప్రేక్షకుల తీర్పు కోరుతూ బాక్సాఫీసు ముందు నిలుస్తూనే ఉంటుంది. యేటా అత్యధిక సినిమాలు ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమల్లో మనది ఒకటి. అందుకే ఒక్కోవారం నాలుగైదు చిత్రాలు కూడా ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి.

    టాలీవుడ్‌లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. యువతరం నూతనోత్తేజంతో సినిమాలు తీస్తోంది. విడుదల విషయంలో ఎదురవుతొన్న ఇబ్బందుల్ని అధిగమిస్తూ తమ సినిమాల్ని బాక్సాఫీసు ముందుకు తీసుకొస్తున్నారు.

    వచ్చే శుక్రవారం 'గాలిపటం', 'జన్మస్థానం' 'నువ్వలా నేనిలా' చిత్రాలు విడుదలవుతున్నాయి. శనివారం 'గీతాంజలి' సందడి చేయబోతోంది. ఇలా మొత్తంగా నాలుగు చిత్రాలతో మోగనన్ను ఈవారం నగారా తెలుగు ప్రేక్షకుడికి భిన్నమైన సందడిని పంచబోతోంది. మరి వీటిలో ఎన్ని చిత్రాలు ఆదరణ పొందుతాయో చూడాలి.

    ఈ చిత్రాల విశేషాలు... క్రింద స్లైడ్ షోలో

    గాలిపటం

    గాలిపటం

    సినిమాకి మహరాజ పోషకులు యువరతమే కాబట్టి.. వాళ్లని దృష్టిలో ఉంచుకొనే కథలు రాసుకొంటున్నారు దర్శకులు. ఆ కోవకి చెందిన చిత్రమే 'గాలిపటం'. ఆది, ఎరికా ఫెర్నాండెజ్‌, క్రిస్టినా అకీవా, రాహుల్‌ రవీంద్రన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నవీన్‌ గాంధీ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంపత్‌ నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌కుమార్‌ వట్టికూటి కలిసి నిర్మించారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే ఒక అబ్బాయి, ఇద్దరమ్మాయిల మధ్య సాగే కథ ఇది. నిర్మాతల్లో ఒకరైన సంపత్‌ నంది మాట్లాడుతూ ''సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటుందీ చిత్రం. ఇందులో ఘాటైన ముద్దు సన్నివేశం ఉంది. అది కథకు చాలా అవసరం. అందుకే అలాగే ఉంచేశాం'' అన్నారు.

    'గీతాంజలి'

    'గీతాంజలి'

    ఇదివరకు హార్రర్‌ సినిమాలు వచ్చేవి. భయపెట్టడమే ఆ చిత్రాల లక్ష్యం. ఇటీవల మాత్రం నవ్విస్తూ భయపెట్టే చిత్రాలు తీస్తున్నారు. ఆ కోవకి చెందినదే... 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. రాజ్‌కిరణ్‌ దర్శకత్వం వహించారు. చిత్రం గురించి నిర్మాత ఎమ్‌.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ''ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. సైతాన్‌రాజ్‌ పాత్రలో బ్రహ్మానందం చేసిన సందడి అందరికీ నచ్చుతుంది'' అన్నారు. ''నా సినీ ప్రయాణంలో గుర్తుండిపోయే చిత్రమిది'' అని చెబుతోంది అంజలి.

    'జన్మస్థానం'

    'జన్మస్థానం'

    వినోదంతో పాటు మంచి సందేశాన్ని అందించే కథతో రూపొందిన సినిమా 'జన్మస్థానం'. సాయికుమార్‌ కీలక పాత్ర పోషించారు. ఓం సాయిప్రకాష్‌ దర్శకుడు. రాయన్న.కె నిర్మించారు. నిర్భయ ఘటన స్ఫూర్తితో తెరకెక్కింది ఈ సినిమా. వ్యవస్థ ఆలోచనా ధోరణి మారినప్పుడే అకృత్యాలు తగ్గుముఖం పడతాయన్న సందేశాన్ని ఇవ్వడమే లక్ష్యంగా రూపొందింది. ''నా సినీ ప్రయాణంలో విభిన్నమైన పాత్రలు చాలానే పోషించాను. అయితే 'పుణ్యభూమి నా దేశం...' లాంటి పాట నాకు వస్తే బాగుండేదని చాలాసార్లు అనిపించేది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. సుద్దాల అశోక్‌తేజ రాసిన 'హోమ్‌ ఆర్మీ' పాటలో నేను రకరకాల గెటప్‌లతో కనిపిస్తాను. ఆ పాట సినిమాకి ఆయువుపట్టులాంటిది'' అన్నారు సాయికుమార్‌.

    'నువ్వలా నేనిలా'

    'నువ్వలా నేనిలా'

    వేర్వేరు వ్యక్తులతో ప్రేమలో ఉన్న ఓ యువ జంట కథతో రూపొందిన సినిమా 'నువ్వలా నేనిలా'. వరుణ్‌సందేశ్‌ పూర్ణ జంటగా నటించారు. త్రినాథరావు నక్కిన దర్శకుడు. ఇందూరి రాజశేఖర్‌రెడ్డి నిర్మాత. ''ప్రేమకథల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. అప్పటికే ప్రేమలో ఉన్న ఓ జంట... కొత్తగా ప్రేమలో ఎలా పడిందన్నది ఆసక్తికరం''అని దర్శకుడు చెబుతున్నారు.

    English summary
    
 Here is the list of New Movies Releasing this week in tollywood. This list is subject to changes as it depends on censor certification and producers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X