»   » సస్పెన్స్ వీడింది...ట్రైలర్ వదిలేసారు (వీడియో)

సస్పెన్స్ వీడింది...ట్రైలర్ వదిలేసారు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : క్రితం సంవత్సరం తమిళనాడు లో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం జిల్లా. ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే రీమేక్ కాకుండా డబ్బింగ్ కు దిగింది. ఇప్పుడు అదే పేరుతొ తెలుగులోకి డబ్బింగ్ చేయాలని ఫిక్స్ అయ్యి ట్రైలర్ సైతం వదిలేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


విజయ్, కాజల్ ప్రధానపాత్రధారులు. మలయాళ నటుడు మోహన్ లాల్ ముఖ్యపాత్ర పోషించాడు. ఈ సినిమాను తెలుగులో తిరిగి తెరకెక్కించే ప్రయత్నం చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎట్టకేలకు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి మోక్షం కలిగింది.


ఈ చిత్రం ట్రైలర్‌ ను విజయ్‌ పుట్టినరోజు సందర్బంగా విడుదల చేశారు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యా నర్ లో ఆర్.బి చౌదరి నిర్మించనున్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 100కోట్లు కలెక్ట్ చేసింది. త్వరలో ఈ చిత్రం తెలుగులో విడుదలకానుంది. ఈ ట్రైలర్ మీరూ చూడండి.చిత్రం కథేమిటంటే...


రాయలసీమ తన నియంత్రణలో పెట్టుకున్న డాన్ మోహన్ లాల్..తను తన సేవకుని కుమారుడు విజమ్ ని దత్తతతీసుకుంటాడు..వీల్లిద్దరు కలిసి తమ జిల్లా ను నియంత్రిస్తారు. విజమ్ తండ్రిని పోలీసులు చంపుతారు..అందువలన విజమ్ కి పోలీసులు అంటే అసహ్యించుకుంటాడు..కాని తను ప్రేమించిన అమ్మాయి కాజల్ అగర్వల్ పోలీల్ అధికారి అని తనికి తేలియదు. మోహన్ లాల్ విజయ్ ని పోలీస్ అధికారిని చేయాలనుకూంటాడు..కాని అతను దాన్ని ద్వేషిస్తాడు..అదే సమయంలో మోహన్ లాల్ ని కూడా వ్యతిరేఖిస్తాడు...మరియు తను ప్రేమించిన అమ్మాయి పోలీస్ అని తేలిసిన తర్వత ఎం జరుగుతుంది..అనేది..మిగతా కథ....


Trailer : Jilla is for the Masses!

మనకు డబ్బింగ్ సినిమాలు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ముఖ్యంగా సూర్య, విజయ్ వంటి హీరోలకు ఇక్కడ బాగానే మార్కెట్ ఏర్పడింది. దాంతో ఈ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

English summary
Vijay and Mohan Lal starrer 'Jilla' has been dubbed into Telugu now and will be released with the same title soon. This film was an average grosser in Tamil Nadu and Kerala.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu