»   » 'రేసుగుర్రం' నిర్మాత కే తెలుగు రైట్స్...పోస్టర్ ఇదిగో

'రేసుగుర్రం' నిర్మాత కే తెలుగు రైట్స్...పోస్టర్ ఇదిగో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అప్పట్లో కన్నడ విలక్షణ హీరో ఉపేంద్ర చేసిన ఉపేంద్ర చిత్రం ఎవరూ మర్చిపోరు. ఈ చిత్రం తెలుగునాట కూడా ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత ఉపేంద్రకు తెలుగులో మరింత క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్ మొన్నామధ్య సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో కీలకపాత్ర చేసేలా చేయగలిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అటువంటి క్రేజ్ కు కారణమైన ఉపేంద్ర చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ సిద్దమవుతోంది. పారుల్ యాదవ్, క్రిష్టినా అకీవా నాయికలుగా నటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను ఉపేంద్ర-2 పేరుతో నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) తెలుగులో అందిస్తున్నారు. ఈ నెలలోనే కన్నడంలో విడుదల కానుంది.

Upendra2 telugu version details

నల్లమలుపు శ్రీనివాస్ మాట్లాడుతూ.... నా సినీ కెరీర్ ఉపేంద్ర నటించిన రా సినిమాతో మొదలైంది. మళ్లీ ఇన్నేళ్లకు ఆయనతో సినిమా తీసే అవకాశం లభించింది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగులో త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు.

ఎ, ఉపేంద్ర, రా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారాయన. కొన్నేళ్ల క్రితం ఆయన నటించిన ఉపేంద్ర తెలుగు, కన్నడ భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కన్నడంలో ఉప్పి-2 పేరుతో ఓ చిత్రాన్ని ఉపేంద్ర నటిస్తూ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భవ్య, కెమెరా: అశోక్ కశ్యప్, సంగీతం: గురుకిరణ్.

English summary
RaceGurram producer N Bujji will be releasing realupendra's #Uppi2 in #Telugu this August.
Please Wait while comments are loading...