»   » ఉత్తమ విలన్ :40 కోట్లు అప్పు, 2 కోట్లు నష్టం

ఉత్తమ విలన్ :40 కోట్లు అప్పు, 2 కోట్లు నష్టం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొన్ని సినిమాలు నిర్మాణంలో ఎంత సంచలనం సృష్టిస్తాయో...రిలీజ్ సమయంలోనే రకరకాల కారణాలుతో ఆగిపోయి...మరింత సంచలన క్రియేట్ చేస్తాయి. కమల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఉత్తమవిలన్ కు అదే పరిస్ధితి ఎదురయ్యింది. ఈ చిత్రం రెండు రోజుల క్రితం విడుదల కావాల్సింది. ఆర్ధిక కారణాలతో ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు అవన్నీ పరిష్కరించుకుని నిన్న(శనివారం)సాయింత్రం విడుదలైంది. తమిళ,తెలుగు వెర్షన్ రెండింటికి అదే సమస్య వచ్చింది. ఈ విషయమై తెలుగు వెర్షన్ రిలీజ్ చేసిన నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ...తమిళ డబ్బింగ్ లు తీసుకునేవారికి ఇది ఓ గుణపాఠం అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే అందుతున్న సమచారం ప్రకారం ఈ చిత్రం రిలీజ్ రోజు నాటికి 40 కోట్లు అప్పు ఉంది. దాంతో ఫైనాన్సర్స్ రిలీజ్ చేయటానికి అంగీకరించలేదు. చివరి నిముషాల్లో నిర్మాత లింగు స్వామి అప్పు గురించి బయిటపెట్టారు.దాంతో వెంటనే తమిళ నిర్మాతల మండలి , సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, శరత్ కుమార్(సౌత్ ఇండియా మూవీ ఆర్టిస్ట్స్ అశోశియేషన్) కలిసి పనిచేసి ఈ సమస్య నుంచి సినిమాని బయిటపడేసే ప్రయత్నం చేసారు. చివరకు కమల్ ..మరో సినిమాని లింగు స్వామి కు చేసేలా ఎగ్రిమెంట్ కుదుర్చుకుని సినిమాని బయటు తీసుకు వచ్చారు.


Uttama Villain: Rs 40 crore in debt, Rs 2 crore in losses

సి.కళ్యాణ్ మాట్లాడుతూ... నేను తెలుగు రైట్స్ తీసుకునేటప్పుడు ఈ అప్పులు గురించి తెలియదు .. శుక్రవారం రిలీజ్ ఆగటం వల్ల ఆయన దాదాపు రెండు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది.


నటుడు కమలహాసన్, దివంగత దర్శకుడు కె.బాలచందర్, పూజాకుమార్, ఆండ్రియా నటించిన చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రాన్ని లింగుసామి తిరుపతి పిక్చర్స్, కమల్‌హాసన్ రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు.


మొదట్లో ఉత్తమ విలన్ మే ఒకటవ తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం శుక్రవారమే తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడులో చిత్రం విడుదలకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో చిత్రం కోసం ఆసక్తితో ఎదురు చూసిన అభిమానులు నిరాశకు గురయ్యారు. రిజర్వేషన్ చేసుకున్న టికెట్ల సొమ్మును థియేటర్ల యజమానులు తిరిగి చెల్లించారు. ఈ చిత్రం కోసం నిర్మాతలు తీసుకున్న రుణాన్ని చెల్లించకపోవడమే చిత్రం విడుదలలో చిక్కులు ఏర్పడినట్లు సమాచారం.


ఇలావుండగా దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, లింగుసామి శనివారం విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ విలన్ చిత్రానికి వ్యాపార రీత్యా ఏర్పడిన కొన్ని సమస్యలతో విడుదలకు జాప్యం జరిగిందన్నారు.చిత్రం విడుదలలో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. చిత్రం విడుదలలో జాప్యానికి లింగుసామి క్షమాపణ కోరారు. 27 గంటల చర్చల తర్వాత ఈ చిత్రం విడుదలకు అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. 

English summary
Kamal Haasan’s film Uttama Villain finally hit theatres on Saturday evening and there was a collective sigh of relief. But on release day, the film had nearly Rs 40 crore as debt and the financiers refused to permit a release as the amount was too high. Kalyan also lost nearly Rs 2 crore when the film failed to hit screens as scheduled on Friday.
Please Wait while comments are loading...