twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kondapolam Closing Collection: ఉప్పెనతో 100కోట్లు రాబట్టిన వైష్ణవ్ తేజ్.. ఇప్పుడు మాత్రం దారుణంగా..

    |

    సాధారణంగా ఏదైనా సినిమా హిట్ అయితే ఆ హీరో మార్కెట్ తదుపరి సినిమాపై కూడా ఎంతో కొంత లాభం చేకూర్చేలా ఉపయోగపడుతుంది. డిజాస్టర్ సినిమా ప్రభావం ఎంతగా ఉంటుందో తెలియదు కానీ హిట్ అయితే మాత్రం తర్వాత సినిమాలపై కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం ఆ తరహాలో సక్సెస్ అవ్వలేకపోయాడు. మంచి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన కొండపొలం సినిమా చివరికి క్లోజింగ్ కలెక్షన్స్ వచ్చేసరికి దారుణమైన నష్టాలను చూసినట్లు అర్థమవుతోంది. ఉప్పెన సినిమాతో 100 కోట్ల బిజినెస్ చేసిన వైష్ణవ్ తేజ్ రెండో సినిమా విషయంలో మాత్రం దారుణంగా నష్టాలను చూడాల్సి వచ్చింది.

    ఆ రికార్డు అందుకున్న మొదటి హీరో వైష్ణవ్

    ఆ రికార్డు అందుకున్న మొదటి హీరో వైష్ణవ్

    టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి సినిమాతోనే వంద కోట్లకు పైగా బిజినెస్ చేసిన ఏకైక హీరోగా వైష్ణవ్ తేజ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా అందరూ అనుకున్నట్టుగానే మొత్తంగా వంద కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఈ సినిమా విడుదలకు ముందు ఈ సినిమా వంద కోట్ల సినిమా అవుతుందని దర్శకుడు సుకుమార్ కూడా ఎంతో నమ్మకంతో వివరణ ఇచ్చాడు.

    అంచనాలను అందుకేకపోయిన కొండపొలం

    అంచనాలను అందుకేకపోయిన కొండపొలం

    మొదటి సినిమాతో భారీగా వసూళ్లు అందుకోవడంతో వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కూడా అంతకు మించి అనేలా ఉంటుంది అని అందరూ అనుకున్నారు. అయితే అంచనాలకు తగ్గట్లుగా అయితే వైష్ణవ్ తేజ్ ముందడుగు వేయలేక పోయాడు. అసలైతే ఉప్పెన సినిమా విడుదల కాకముందే క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమా చేసేందుకు వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఎప్పటి నుంచి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేసి చివరికి అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.

    బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..

    బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే..

    ఇక ఈ సినిమా ఐదు కోట్ల లోపే అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించడం జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా ఈ సినిమా కోసం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమా పాటలతో పాటు ట్రైలర్ తో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. మొత్తంగా సినిమా 7.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టింది.

    వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

    ప్రపంచవ్యాప్తంగా కొండపొలం సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 0.98 కోట్లు, సీడెడ్ 0.44 కోట్లు, ఉత్తరాంధ్ర 0.65 కోట్లు, ఈస్ట్ 0.36 కోట్లు, వెస్ట్ 0.27 కోట్లు,
    గుంటూరు 0.39 కోట్లు, కృష్ణా 0.30 కోట్లు, నెల్లూరు 0.20 కోట్లు.. ఏపీ + తెలంగాణ (టోటల్) 3.59 కోట్లు.. రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.31 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 3.90 కోట్లు.

    నష్టం ఎంతంటే..

    నష్టం ఎంతంటే..


    7.75 ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన కొండపొలం సినిమా ఎనిమిది కోట్ల టార్గెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద ఈజీగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకున్న వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో తప్పకుండా మొదటి వారంలోనే ఎనిమిది కోట్ల వసూళ్లను అందుకుంటాడు అని అందరూ అనుకున్నారు కానీ సినిమా నాలుగు కోట్ల షేర్ ను కూడా అందుకోలేకపోయింది. క్లోజింగ్ సమయానికి సినిమా 3.90 కోట్ల వరకు నష్టాలను మిగిల్చినట్లు అర్థమవుతోంది.

    English summary
    Vaishnav tej Kondapolam Closing Collection
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X