»   » నష్టం ఎంత ?: ‘ముకుందా’ మొత్తం కలెక్షన్స్ (ఏరియావైజ్)

నష్టం ఎంత ?: ‘ముకుందా’ మొత్తం కలెక్షన్స్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్రిసమస్ కు మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ ముకుందా చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన వరుణ్ తేజ్ మొదటి సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం తొలిరోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే చిత్రం యూనిట్ మాత్రం ఎక్కడా నిరాశపడకుండా ఓ రేంజిలో పబ్లిసిటీని పెంచారు.ఈ నేపధ్యంలో చిత్రం కలెక్షన్స్ కు అది ఏ మాత్రం కలిసివచ్చిందో చూద్దాం. ట్రేడ్ లో చెప్పుకోబడుతున్న సమాచారం ప్రకారం...ఈ చిత్రం థియోటర్ రైట్స్ ని మొత్తం 18 కోట్లకు అమ్మారు. అయితే అన్ని కలిపి 12 కోట్ల వరకూ వచ్చింది. మిగిలింది నష్టంగా చెప్తున్నారు. నిర్మాతలు సొమ్ము చేసుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కు చేతులు కాలాయి. ఏరియావైజ్ ఎక్కడెక్కడ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మొత్తం కలెక్షన్స్ (ఏరియావైజ్):


Varun Teja's Mukunda Total Collections

నైజాం : Rs 3.10 కోట్లు


సీడెడ్ : Rs 1.65 కోట్లు


వైజాగ్ : Rs 1.20 కోట్లు


తూర్పు గోదావరి : Rs 1.20 కోట్లు


పశ్చిమ గోదావరి : Rs 1.20 కోట్లు


కృష్ణా : Rs 72 లక్షలు


గుంటూరు: Rs 1.15 కోట్లు


నెల్లూరు : Rs 38 లక్షలు


ఎపి &నైజాం టోటల్ కలెక్షన్స్ (షేర్): Rs 10.35 కోట్లు


ముకుందా ప్రపంచ వ్యాప్త మొత్తం కలెక్షన్స్ (షేర్): Rs 12.25 కోట్లు (ఇందులో కర్ణాటక: Rs 1.05 కోట్లు; మిగిలిన భారత్ దేశంలో ప్రాంతాలు: Rs 15 లక్షలు; ఓవర్ సీస్: Rs 70 లక్షలు) ఈ చిత్రం రిలీజైన మొదటి రెండు తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవటం ప్రారంభమయ్యింది.


చిత్రం కథేమిటంటే... స్నేహితులే ప్రాణంగా తిరిగే ముకుందా(వరుణ్ తేజ్)కి బెస్ట్ ప్రెండ్ అర్జున్. అర్జున్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు మున్సిపల్ ఛైర్మన్ సుబ్రమణ్యం(రావు రమేష్)పెద్ద కుమార్తె. అన్ని సినిమాల్లో లాగానే హీరో ఆ ప్రేమకు సహకరిస్తూ అడ్డు వచ్చిన వాళ్లను అడ్డంగా కొడ్తూంటాడు. పనిలో పనిగా 'పరుగు' సినిమా చూసినట్లు... ఆయన రెండో కుమార్తె పూజ(పూజ హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఇది సుబ్రమమ్యాణికి బాగా కాలుతుంది. ఈ లోగా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. సుబ్రమణ్యాన్ని దెబ్బ కొట్టడానికి ముకుందా... ఆయనకు పోటీగా ఆ ఊళ్లో చదువుకుని ప్రస్టేషన్ తో తిరిగే ప్రకాష్ రాజ్ ని పోటీకి నిలబెడతాడు...ప్రచారం చేస్తాడు. ఆ పరిస్దితుల్లో మిగతా కథ ఏమౌతుంది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.


లియో ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో వరుణ్‌తేజ్, పూజాహెగ్డే , రావు రమేష్, రఘుబాబు, ప్రకాష్‌రాజ్, రావు రమేష్, నాజర్, రఘుబాబు, తదితరులు నటించారు. సంగీతం: మిక్కీ.జే.మేయర్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కెమెరా:మణికందన్, ఎడిటింగ్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల, నిర్మాత: నల్లమలుపు బుజ్జి, సమర్పణ: ఠాగూర్ మధు

English summary
As per trade, 'Mukunda' , the launch pad of Varun Tej theatrical rights were sold out for Rs 18 crore. Although Producers have made profits, Distributors and Exhibitors have burnt their hands to some extent.
Please Wait while comments are loading...