Don't Miss!
- Finance
Telangana development: ఆ ఖర్చులో తెలంగాణ నంబర్ వన్.. పెద్ద రాష్ట్రాలను సైతం నెట్టికి ముందుకు..
- News
Bengaluru: తోడు దొంగలు, 60 చోట్ల చోరీలు, జడ్జ్ ఇంటిని వదలని కాలాంతకులు, క్లైమాక్స్ లో!
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Lifestyle
మీకు మధుమేహం ఉందో లేదో మీ పాదాలను చూసి తెలుసుకోవచ్చు..
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Veera Simha Reddy Advance Booking ఓవర్సీస్‌లో మాస్ హిస్టీరియా.. రిలీజ్‌కు ముందే రికార్డులతో బాలయ్య!
నటసింహం నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో మలినేని గోపిచంద్ దర్శకత్వంలో భారీగా రూపొందిన చిత్రం వీర సింహారెడ్డి. సంక్రాంతి పండుగ బరిలో దూకిన ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా క్రేజ్‌ను, బజ్‌తో ముందుకెళ్తున్నది. జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రపంచవ్యాప్తంగా భారీగా
అఖండ భారీ విజయం తర్వాత విడుదలవుతున్న వీరసింహారెడ్డి చిత్రానికి రిలీజ్‌కు ముందే భారీ ఆదరణ సొంతం చేసుకొంటున్నది. అన్‌స్టాపబుల్ టాక్ షోతో ప్రతీ గడపకు చేరువైన బాలయ్య నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. ప్రపంచవ్యాప్తంగా 26 వేల టికెట్లు ఇప్పటి వరకు ఈ సినిమా టికెట్లు అమ్ముడయ్యాయి. గతంతో పోల్చుకొంటే.. బాలయ్య సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్ జరగడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

దక్షిణాదిలో భారీ ఓపెనింగ్స్
ఇక వీర సింహారెడ్డి ప్రాంతాల వారీగా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ స్పందన కూడగట్టుకొంటున్నది. హైదరాబాద్‌లో 11.42 లక్షలు, బెంగళూరులో 30 లక్షలు, చెన్నైలో 4 లక్షలు, వరంగల్‌లో 17.58 లక్షలు, ముంబైలో 1.52 లక్ష రూపాయలు సొంతం చేసుకొన్నది.

ఆస్ట్రేలియాలో ప్రీ సేల్స్ బుకింగ్
ఇక వీరసింహరెడ్డికి చిత్రానికి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఓపెన్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య సినిమాకు భారీ ఓపెన్సింగ్ లభిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీగా కలెక్షన్లు నమోదయ్యాయి. ఆస్ట్రేలియాలో మొత్తం 65 షోలు ప్రదర్శిస్తుండగా, ఇప్పటి వరకు 1700 టికెట్లకుపైగా అమ్ముడ కాగా. మొత్తం 35 లక్షల రూపాయలు వసూలు చేసింది.

యూకేలో అనూహ్య స్పందన
వీరసింహారెడ్డికి యూకేలో కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారీ స్పందన కనిపిస్తున్నది. యూకేలో ఇలాంటి రెస్పాన్స్ రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి 70 షోలు ప్రదర్శించడానికి ఏర్పాట్లు జరుగగా.. ఇప్పట వరకు 5500 టికెట్లు అమ్ముడుపోగా.. 48 లక్షల రూపాయల వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో లభించింది.

అమెరికాలో మాస్ హిస్టీరియా
ఇక అమెరికాలో వీరసింహారెడ్డికి మాస్ హిస్టీరియా కనిపిస్తున్నది. అఖండతో మంచి మార్కెట్ ఓపెన్ కాగా.. ఆ క్రేజ్‌ను వీరసింహరెడ్డి కొనసాగిస్తున్నది. ఈ సినిమాను 243 లోకేషన్లలో ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేయగా.. 570 షోలకు ఇప్పటి వరకు ఈ సినిమాను సిద్దం చేశారు. దాంతో ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్లకు చేరువైంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 450K డాలర్లు 3.7 కోట్లు రాబట్టింది.