»   » కాటమరాయుడికి గురు దెబ్బ.. వెంకీకి మెగాస్టార్ మాట సహాయం!

కాటమరాయుడికి గురు దెబ్బ.. వెంకీకి మెగాస్టార్ మాట సహాయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో భారీ అంచనాలతో విడుదలైన కాటమరాయుడు చిత్రానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన కాటమరాయుడు చిత్రం ఓపెనింగ్స్ బాగానే ఉన్నా ఆ తర్వాత కలెక్షన్లను నిలబెట్టుకోలేకపోయిందనే వార్తలు మీడియాలో వచ్చాయి. కాటమరాయుడు చిత్రం తొలివారాంతంలో రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. అయినప్పటికీ బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చిందనే రూమర్ జోరుగా ప్రచారమవుతున్నది.

గురు చిత్రానికి పాజిటివ్ టాక్

గురు చిత్రానికి పాజిటివ్ టాక్

కాటమరాయుడు కలెక్షన్లను రాబట్టడానికి సతమతమవుతున్న నేపథ్యంలో వెంకటేష్ నటించిన గురు చిత్రం మరో దెబ్బ తీసినట్టు తెలుస్తున్నది. గురు చిత్రానికి సూపర్ హిట్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా పెరిగాయి. దాంతో కాటమరాయుడు కలెక్షన్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైందనే వార్త తాజాగా వినిపిస్తున్నది.


కాటమరాయుడికి భారీ కోత

కాటమరాయుడికి భారీ కోత

తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా రికార్డు స్థాయి థియేటర్లలో విడుదలైంది. గురు మంచి టాక్ రావడంతో కాటమరాయుడు థియేటర్ల విషయంలో భారీగా కోత పడిందట. కొద్దిగా వచ్చే కలెక్షన్లు కూడా గురు చిత్రానికి మరలినట్టు రిపోర్టు అందుతున్నది.


భారీ నష్టాలు మిగిల్చిన..

భారీ నష్టాలు మిగిల్చిన..

కాటమరాయుడు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు కలిపి రూ.85 కోట్లకు పైగా అమ్మినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం రూ.25 కోట్ల నష్టం ఉందనే టాక్ వినిపిస్తున్నది. పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాలు ఆదరణకు నోచుకోకపోవడంతో బయ్యర్లు ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తున్నది.


గురు చిత్రానికి పాజిటివ్ టాక్

గురు చిత్రానికి పాజిటివ్ టాక్

హిందీ, తమిళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నతర్వాత రీమేక్‌గా టాలీవుడ్‌లో గురు చిత్రం విడుదలైంది. సినిమాపై ఉన్న నమ్మకంతో ఒకరోజు ముందుగానే మీడియాకు, ప్రముఖులకు ప్రివ్యూషో వేశారు. విడుదలకు ఒకరోజు ముందే మీలో ఎవరూ కోటీశ్వరుడులో వెంకటేష్ పాల్గొనగా.. గురు చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. మెగా టాక్ కూడా కొంత పనిచేసిందన్న మాట వినిపిస్తున్నది.


English summary
Venkatesh’s Guru movie got good response from all corners, film’s pickings have been quite good. This film collects good numbers first weekend. Katamarayudu’s collections have been badly hit by Guru.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu