twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Beast Pre Release : KGFతో పోటీకి దిగినా తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ కు అన్ని కోట్లు.. అదే ధైర్యమా?

    |

    మాస్టర్ తో హిట్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్ ఈ నెల 13వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగులో కూడా ఈసారి విజయ్ సినిమాను పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత? అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఏ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది? అనే వివరాలు మీ ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం..

    భారీ బడ్జెట్తో

    భారీ బడ్జెట్తో

    విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాకు కళానిధి మారన్ దాదాపు 190 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించినట్లు తెలుస్తోంది. మొదట 150 కోట్ల బడ్జెట్ లోనే సినిమాను తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత బడ్జెట్ పెరిగిపోయింది.

     డిమాండ్ ఏర్పడి

    డిమాండ్ ఏర్పడి

    ఎందుకంటే దర్శకుడు నెల్సన్ ఇంతకు ముందు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసైనా ఆయన చేసిన రెండో సినిమా డాక్టర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. దీంతో అతనికి మంచి గుర్తింపును తేవడమే కాకుండా బీస్ట్ సినిమాకు కూడా మంచి హైప్ క్రియేట్ చేసినట్టు అయింది. ఈ క్రమంలోనే పూజను కూడా తెర మీదకు తీసుకురావడంతో ఈ సినిమా బడ్జెట్ పెరిగింది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాకు డిమాండ్ ఏర్పడింది.

     తెలుగులో 10 కోట్లకు

    తెలుగులో 10 కోట్లకు

    190 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బీస్ట్ సినిమా తమిళనాడులో 75 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. విజయ్ కెరీర్లోనే ఇది అత్యధిక బిజినెస్ అని అంటున్నారు. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడటంతో దిల్ రాజు, సురేష్ బాబు, ఏషియన్ సినిమాస్ సునీల్ కలిసి ఈ సినిమా తెలుగులో 10 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

    505 థియేటర్లు

    505 థియేటర్లు

    అయితే ఈ సినిమా ఏయే ఏరియాలలో ఎంత బిజినెస్ చేసింది అని తెలుసుకునే ప్రయతనం చేద్దాం. ఈ సినిమా నైజాం హక్కులు 3.50 కోట్లకు, సీడెడ్ హక్కులు 2.1 కోట్లకు, ఆంధ్రా - 4.40 కోట్లకు అమ్ముడుపోయాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం 10 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ 10.50 కోట్లుగా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా తెలుగులో ఆ టార్గెట్ ను ఈజీగా బ్రేక్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక నైజాంలో 175, సీడెడ్ లో 90, ఆంధ్రాలో 240 మొత్తం 505 థియేటర్లు లభించాయి.

    నిర్మాత సేఫ్ జోన్ లో

    నిర్మాత సేఫ్ జోన్ లో

    ఇక కర్ణాటకలో ఈ సినిమా 7 కోట్ల వరకు అమ్ముడుపోయినట్టు చెబుతున్నారు. కేరళలో కూడా విజయ్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా ఆరు కోట్లు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో అయితే 24 కోట్లకు అమ్ముడు పోయిందని అంటున్నారు. అలా థియేట్రికల్ గా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు చెబుతున్నారు. ఇక మిగతా హక్కులు అన్నీ కలుపుకుంటే నిర్మాత సేఫ్ జోన్ లో పడిపోయారని అంటున్నారు.

    అయితే 14వ తేదీన విడుదల అవుతున్న కేజీఎఫ్ సినిమాతో పోలిస్తే ఈ సినిమా దాదాపు చాలా తక్కువ రేటుకు అమ్ముడుపోయింది. ఈ క్రమంలో ఏది ఎలా ఉన్నా తమ లాభం తమకు వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. సినిమా కొన్న దిల్ రాజు, సునీల్, సురేష్ బాబులకు సొంత థియేటర్లు ఉండడంతో ఎలాంటి టెన్షన్ లేదు. తమ పెట్టుబడి తమకు వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    Vijay Beast movie telugu and south states Pre Release Bussiness details are here.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X