100 కోట్లపై కన్నేసిన గీత గోవిందం.. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే..
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. గత ఆరు రోజుల్లో ఏ మాత్రం తగ్గకుండా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల సక్సెస్ తర్వాత గీత గోవిందం రూపంలో విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకొన్నారు. గత ఆరు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి...

100 కోట్లపై దృష్టి
గీత గోవిందం చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన కొద్ది రోజులకే రూ.50 కోట్ల మార్కును దాటింది. ఈ చిత్రం ఆరో రోజున ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల వసూళ్లను సాధించడం గమనార్హం. ఇదే ఊపు కొనసాగితే ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Recommended Video


వీకెండ్ తర్వాత బలంగా
సాధారణంగా వారంతం తర్వాత సోమవారం సినిమాల కలెక్షన్లు తగ్గుతాయి. కానీ గీత గోవిందం విషయంలో భారీ కలెక్షన్లు వచ్చాయి. ఆగస్టు 20 తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.5.5 కోట్లు వసూలు చేయడం సినిమాకు పెరుగుతున్న ఆదరణను చెప్పింది. కేవలం ఆరు రోజుల్లోనే పంపిణిదారులందరూ భారీ లాభాల్లోకి ప్రవేశించడంతో ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్‌గా కన్ఫర్మ్ చేశారు.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద
యూఎస్ బాక్సాఫీస్ వద్ద గీత గోవిందం సత్తా చాటుతున్నది. తొలి రోజున మంగళవారం నుంచి గురువారం వరకు 731,490 డాలర్లు, శుక్రవారం 240,941, శనివారం 354,433, ఆదివారం 212,610 డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం మొత్తంగా 10.75 కోట్లు సాధించింది.

విజయ్ దేవరకొండ చిత్రాలు
గీత గోవిందం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా రిలీజ్‌కు సిద్దంగా ఉంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న నోటా, అలాగే డియర్ కామ్రేడ్ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. సెప్టెంబర్‌లో టాక్సీవాలాను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











