వరల్డ్ ఫేమస్ లవర్ : ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్‌లో జరిగిందంటే..?
టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకులను పలకరిచేందుకు రెడీ అవుతున్నాడు. చివరగా వచ్చిన డియర్ కామ్రేడ్ అంతగా వర్కౌట్ కాకపోయినా.. వరల్డ్ ఫేమస్ లవర్ మీద భారీగానే అంచనాలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. రౌడీ ఫ్యాన్స్ సైతం ఈ సారి అశలు పెట్టుకున్నారు. ఇక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ రేంజ్‌లో జరిగిందో ఓ సారి చూద్దాం.

నలుగురు భామలతో రొమాన్స్..
విజయ్ దేవరకొండ ఒక్క హీరోయిన్‌తో రొమాన్స్ చేస్తేనే బాక్సాఫీస్ షేక్ అయింది. మరి నలుగురు భామలతో అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఓ రేంజ్‌లో రచ్చగా చేసింది. అర్జున్ రెడ్డి ఛాయలు కనిపించాయని కొందరు కామెంట్స్ కూడా చేశారు. ఐశ్వర్యా రాజేశ్, రాశీ ఖన్నా, కేథరిన్, ఇజబెల్లాతో విజయ్ రొమాన్స్ హైలెట్ కానుందని టాక్.

తెలుగు రాష్ట్రాల్లో..
విజయ్ దేవరకొండ చిత్రమంటే యూత్‌లో ఎనలేని క్రేజ్ ఉంటుంది. దానికి తగ్గట్టే విజయ్ చిత్రాలకు మంచి బిజినెస్ జరుగుతూ ఉంటుంది. వరల్డ్ ఫేమస్ లవర్ కూడా భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 18 కోట్లకు సేల్ అయినట్టు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే..?
ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీగా క్రేజ్ తెచ్చుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాన్ని రెస్టాఫ్ ఇండియాలో 2.5కోట్లు, ఓవర్సీస్‌లో 3.2కోట్లు పలికినట్టు టాక్. ఇలా మొత్తంగా ఈ మూవీ 23.81కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది.
Recommended Video

శాటిలైట్స్ రైట్స్ కూడా..
విజయ్ చిత్రాలకు శాటిలైట్స్‌లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. థియేటర్‌లో ఫెయిల్ అయిన డియర్ కామ్రేడ్ యూట్యూబ్, బుల్లితెరపై సక్సెస్ అయింది. ఈ మూవీ శాటిలైట్‌లో ఏడు కోట్లు, డిజిటల్ రైట్స్‌లో ఐదు కోట్లు, హిందీ హక్కులకు ఎనిమిది కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











