»   » అదుర్స్ :దేవిశ్రీప్రసాద్ డాన్స్ తో పాట ప్రోమో (వీడియో)

అదుర్స్ :దేవిశ్రీప్రసాద్ డాన్స్ తో పాట ప్రోమో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తమిళ స్టార్ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కించిన చిత్రం 'పులి'. ఈ చిత్రంలోని 'పులి.. పులి..' అనే పాట ప్రోమోను విడుదల చేసినట్లు సినిమా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపారు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.

ఈ చిత్రానికి చింబు దేవన్‌ దర్శకత్వం వహించారు. విజయ్‌తోపాటు శ్రీదేవి, శ్రుతి హాసన్‌, హన్సిక, సుదీప్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో 'పులి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘కత్తి' చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ లేటెస్ట్‌గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్న ‘పులి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకుంటోంది.

Devisriprasad

ఈ సందర్భంగా నిర్మాతలు శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ ‘‘ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీదేవిగారు రాణీ సౌమ్యాదేవి క్యారెక్టర్‌లో చాలా అద్భుతంగా నటించారు. ‘పులి' చిత్రం విజయ్‌ కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది'' అన్నారు.

శోభారాణి మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌ నుంచి వస్తున్న భారీ ఫాంటసీ సినిమా ఇది. విజయ్‌ సూపర్‌హీరోలా కనిపిస్తారు. శ్రీదేవి పాత్ర సినిమాకు కీలకం. డిఎ్‌సపి సంగీతం ఆకట్టుకుంటుంది. భారీ బడ్టెట్‌తో హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు సీజీ వర్క్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తుపాకీ సినిమా తర్వాత విజయ్‌ పట్టుబట్టి ఈ సినిమా హక్కుల్ని మాకు ఇప్పించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు చక్కని స్పందన వస్తోంది. '' అని తెలిపారు.

విజయ్‌, శృతి హాసన్‌, హన్సిక, ఆలిండియా స్టార్‌ శ్రీదేవి, కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ త్రిభాషా చిత్రాన్ని ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ బేనర్‌పై శింబు దేవన్‌ దర్శకత్వంలో శిబు తమీన్స్‌, పి.టి.సెల్వకుమార్‌ నిర్మిస్తున్నారు.

English summary
A promo song from Vijay's "Puli" was released on Monday, 14 September by Sony Music on Youtube. It is 2.25-minute clip in which Devi Sri Prasad will be seen dancing and crooning the number and the music director has also written the lyrics for the song.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu