Don't Miss!
- News
Vastu tips: ఇంటికెళితే చిరాకులా.. అన్నీ సమస్యలా.. బయటపడేందుకు చెయ్యాల్సిందిదే!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varasudu Collections: వారసుడికి మరో దెబ్బ.. తెలుగులో షాకింగ్‌గా.. దిల్ రాజు గట్టెక్కాలంటే మాత్రం!
దక్షిణ భారతదేశానికి చెందిన వారిలో కొందరు హీరోలు మాత్రమే నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా ప్రతి సినిమాకూ జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపుతోన్నారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఒకడు. పక్కా కమర్షియల్ కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'వారసుడు' తమిళంలో (వారిసు) అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

వారసుడుగా విజయ్ అరాచకం
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన తాజా సినిమానే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ కీలక పాత్రలు చేశారు.
సీతా రామం హీరోయిన్ అందాల విందు: క్లీవేజ్ షోతో టెంప్ట్ చేస్తోన్న బ్యూటీ

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్
విజయ్‌కు ఉన్న మార్కెట్ అనుగుణంగానే 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

7వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా
విజయ్ 'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు వసూళ్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 6 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 24 లక్షలు షేర్, రూ. 40 లక్షలు గ్రాస్ వసూలు అయింది.
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న కేతిక శర్మ హాట్ వీడియో: ముద్దులు పెట్టి.. ఎదపై హత్తుకుని!

7 రోజులకూ కలిపి ఎంతంటే?
7 రోజుల్లో 'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.71 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.07 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.12 కోట్లు, ఈస్ట్‌లో రూ. 98 లక్షలు, వెస్ట్‌లో రూ. 76 లక్షలు, గుంటూరులో రూ. 90 లక్షలు, కృష్ణాలో రూ. 91 లక్షలు, నెల్లూరులో రూ. 62 లక్షలతో కలిపి రూ. 13.07 కోట్లు షేర్, రూ. 23.65 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది
పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా వచ్చిన 'వారిసు' మూవీ తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు 9వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లుకు పైగా గ్రాస్ వసూలైంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 233.50 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 119.20 కోట్లు షేర్‌ను రాబట్టింది. ఫలితంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది.
బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి
విజయ్ నటించిన 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది 10 రోజుల్లో రూ. 119.20 కోట్లు రాబట్టింది. అంటే.. మరో రూ. 19.80 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 15 కోట్ల టార్గెట్‌కు ఇంకా రూ. 1.93 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.