Don't Miss!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- News
తారకరత్న గురించి వైద్యులు ఏమన్నారంటే..
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Lifestyle
షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Varasudu Collections: అస్సలు పెరగని కలెక్షన్స్.. తెలుగులో నష్టాలు తప్పేలా లేవు.. ఎంత రావాలంటే?
తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్ర హీరోగా మంచి గుర్తింపును అందుకుంటున్న విజయ్ మెల్లగా తెలుగులో కూడా తన స్థాయిని పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈసారి దిల్ రాజు ప్రొడక్షన్లో చేసిన వారిసు సినిమా తెలుగులో వారసుడుగా విడుదలైన విషయం తెలిసిందే. తమిళంలో కంటే తెలుగులో కాస్త ఆలస్యంగా వచ్చిన ఈ సినిమా మొదట ఓపెనింగ్స్ అయితే బాగానే అందుకుంది. కానీ ఇప్పుడు టార్గెట్ ను మాత్రం వారం రోజులైనా కూడా పూర్తి చేయలేకపోయింది. ఇక మొత్తంగా ఈ సినిమా 8వ రోజు ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే..
వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారసుడు సినిమాకు మొదట కొంత నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. అయినప్పటికీ విజయ్ తన స్టార్ క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ సాధించాడు. తెలుగులో ఈ సినిమా 14వ తేదీన విడుదల అయింది. అంతకంటే ముందే జనవరి 11వ తేదీన తమిళంలో విడుదలైంది. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 137.90 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే చేసింది.

8వ రోజు తెలుగు కలెక్షన్స్
ముందుగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సినిమా రోజురోజుకు కలెక్షన్స్ మెల్లగా తగ్గించుకుంటూ వచ్చింది. మొదటి రోజు 3.10 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత మెల్లగా 24 లక్షలకు పడిపోయింది. ఏడవ రోజు కంటే ఇంకాస్త తక్కువగా 8వ రోజు ఈ సినిమా 20 లక్షల షేర్ కలెక్షన్స్ మాత్రమే సొంతం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

8 రోజుల్లో టోటల్ కలెక్షన్స్
8 రోజుల్లో 'వారసుడు' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఈ విధంగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.77 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.11 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.16 కోట్లు, ఈస్ట్‌లో 1.00 కోట్లు, వెస్ట్‌లో రూ. 77 లక్షలు, గుంటూరులో రూ. 91 లక్షలు, కృష్ణాలో రూ. 92 లక్షలు, నెల్లూరులో రూ. 63 లక్షలతో కలిపి రూ. 13.27 కోట్లు షేర్, రూ. 23.95 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత?
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'వారిసు' సినిమా తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. ఇక విజయ్ నటించిన ఈ సినిమాకు 11వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లుకు పైగా గ్రాస్ వసూలైంది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 239.50 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 122.20 కోట్లు షేర్‌ను రాబట్టింది. ఫలితంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది.

ప్రాఫిట్స్ లోకి రావాలంటే..
'వారిసు' సినిమా అంచనాలకు తగ్గట్టుగా రూ. 139 కోట్లు రేంజ్ లో బ్రేక్ ఈవెన్ తో వచ్చింది. ఈ సినిమా 11 రోజుల్లో రూ. 119.20 కోట్లు రాబట్టింది. అంటే.. మరో రూ. 19.80 కోట్లు వస్తేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక, తెలుగులో వారసుడు రూ. 14 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా.. 15 కోట్ల టార్గెట్ సెట్ అయ్యింది. ఇక తెలుగులో 13.27 కోట్లు వచ్చాయి. కాబట్టి ఇంకా రూ. 1.73 కోట్ల వరకు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.