twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Vikram Advance Bookings బాక్సాఫీస్ వద్ద కమల్ హాసన్ మ్యాజిక్.. యూనివర్సల్ స్టార్ స్టామినా అంటే ఇది మరీ!

    |

    యూనివర్సల్ స్టార్, విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సుమారు నాలుగేళ్ల తర్వాత కమల్ నటించిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతున్నది. లోకేష్ కనకరాజ్ నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు కూడా మంచి స్పందన కనిపిస్తున్నది. విక్రమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా నమోదు చేస్తున్న అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే..

    యూఎస్, యూకే, ఇతర దేశాల్లో

    యూఎస్, యూకే, ఇతర దేశాల్లో

    విక్రమ్ సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు, లిరికల్ వీడియోలకు అన్ని భాషల్లో అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

    ఒకే రోజు మూడు ప్యాన్ ఇండియా మూవీస్

    ఒకే రోజు మూడు ప్యాన్ ఇండియా మూవీస్

    దేశవ్యాప్తంగా సిని పరిశ్రమలో ఓ క్రేజీ విషయం ఈ వారం కనిపిస్తున్నది. ఏకంగా మూడు ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. విక్రమ్‌తోపాటు మేజర్, సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఈ మూడు చిత్రాల కంటే విక్రమ్ సినిమాకు భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది.

    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్

    అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్

    అమెరికాలో విక్రమ్ సినిమాకు సంబంధించిన అన్ని భాషల వెర్షన్లకు మంచి స్పందన లభిస్తున్నది. కడపటి వార్తలు అందేసరికి 287 లోకేషన్లలో 714 స్క్రీన్లలో 330k డాలర్లు వసూలు చేసింది. ప్రీమియర్ షోలు ముగిసే సమయానికి ఈ చిత్రం 550k డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    మలేషియాలో సూపర్ రెస్పాన్స్

    మలేషియాలో సూపర్ రెస్పాన్స్

    మలేషియాలో విక్రమ్ తమిళ వెర్షన్‌కు బ్రహ్మండమైన స్పందన కనిపిస్తున్నది. కడపటి సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 87 లొకేషన్లలో 473 షోల కోసం 23600 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 425k మలేషియన్ డాలర్లు వసూలు అయ్యాయి. ప్రీమియర్ల ముగిసే సమయానికి ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

    ఆస్ట్రేలియాలో బ్రహ్మరథం

    ఆస్ట్రేలియాలో బ్రహ్మరథం

    విక్రమ్ సినిమాకు ఆస్ట్రేలియాలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అడ్వాన్సు బుకింగ్‌ కోసం అభిమానులు పోటెత్తారు. 70 లోకేషన్లలో 216 షోల ద్వారా 5 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ప్రీమియర్లు, మొదటి రోజు ముగిసే సమయానికి భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది.

    దక్షిణాది రాష్ట్రాల్లో

    దక్షిణాది రాష్ట్రాల్లో

    దక్షిణాదిలో విక్రమ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఇలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తమిళ వెర్షన్ ఇప్పటి వరకు 67 శాతం అక్యుపెన్సీతో 6.3 లక్షలు, తెలుగు వెర్షన్ 30 శాతం అక్యుపెన్సీతో 25 లక్షలు వసూలు చేసింది. చెన్నైలో 70 శాతం అక్యుపెన్సీతో 2 కోట్లకుపైగా, బెంగళూరులో 30 శాతం అక్యుపెన్సీతో 88 లక్ష్లలు వసూలు చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరిస్థితి ఇలా

    ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరిస్థితి ఇలా

    కమల్ హాసన్ విక్రమ్ సినిమా దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 4.7 కోట్లు, పృథ్వీరాజ్ చిత్రం 1.5 కోట్లు, మేజర్ చిత్రం 1.3 కోట్లు అడ్వాన్సు బుకింగ్ ద్వారా వసూలు చేసింది.

    English summary
    Kamal Haasan's Vikram movie shows outstanding advance and Online Bookings across Tamilnadu, Kerala, Karnataka, Andhra Pradesh, Telangana and Overseas markets.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X