»   »  నందమూరి పోరులో నలిగిపోతాడా?

నందమూరి పోరులో నలిగిపోతాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంక్రాంతి పూట మరో హీరో తన సత్తా తెలుగు భాక్సాఫీస్ వద్ద చూపించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఆ హీరో మరెవరో కాదు విశాల్. తెలుగు స్టార్ హీరోలు బాలకష్ణ, ఎన్టీఆర్, నాగార్జున సరసన ఈ హీరో నిలబడగలడా లేదా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సంక్రాంతి నందమూరి హీరోలు..మధ్య పోరు పోటీపోటాగా ఉంది. ఈ నేపధ్యంలో తమ తమ సినిమాలతో విశాల్ ను తోక్కిపాడేస్తారా లేకా సరెండర్ అవుతారో ఇవన్నీ కాకుండా మన తెలుగు స్టైయిట్ సినిమాలతో కథ కళి ఆడతాడో అనేది వేచి చూడాలి.

 Vishal's Kathakali also for Shankaratnhi

విశాల్, కేథరిన్ థెరిస్సా, రెజీనా కాసాండ్రా ప్రధాన పాత్రలలో పాండిరాజ్ తెరకెక్కించిన చిత్రం కథకళి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుండగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. గతంలో పసంగ2, ఇదు నమ్మ ఆళు లాంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన పాండిరాజ్ కథకళి చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో విడదల చేయనున్నారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల కాగా, ఇందులో కేథరిన్ హావ భావాలు, ఫైటింగ్ సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంటతకు గురి చేస్తోండగా, ఈ చిత్రం యధార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్టు తెలుస్తోంది.

ఈ సందర్బంగా విశాల్‌ మాట్లాడుతూ, ప్రేమ, యాక్షన్‌, వినోదాల మేళవింపుతో రూపొందిన సినిమా ఇది. పాండ్యరాజ్‌ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చింది. ఇందులో ఎవరు ఎవర్ని కథకళి ఆడించారన్నది తెరపైనే చూడాలని ఆయన కోరారు.

 Vishal's Kathakali also for Shankaratnhi

కథకళి చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనుండగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌లో రెజీనా ఎక్కడ కనిపించలేదు. ఇంక ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతాన్ని అందించగా, ట్రైలర్‌లో బ్యాక్ గ్రైండ్ స్కోర్ చాలా అద్బుతంగా ఉందంటూ అభిమానులు ముచ్చటించుకుంటున్నారు.

నాజర్‌, కరుణాస్‌, శత్రు, సూరి, శ్రీజిత్‌ రవి, పవన్‌, మైమ్‌ గోపీ, మధుసూదన్‌రావు తదితరులు ముఖ్యపాత్రలు పోషించింన, ఈ సినిమాకు ఛాయాగ్రహణం: బాలసుబ్రమణ్యం, సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, కూర్పు: ప్రదీప్‌ ఇ.రాఘవ్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, డైరక్టర్ : పాండ్యరాజ్‌

English summary
Vishal’s Kathakali movie is scheduled for release on January 14, as a Pongal gift to audience.
Please Wait while comments are loading...