»   » ఈ రోజు రిలీజ్ కావటం లేదు..వాయిదా

ఈ రోజు రిలీజ్ కావటం లేదు..వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:సంక్రాంతి బరిలోంచి విశాల్ చిత్రం కథకళి తెలుగు వెర్షన్ తప్పుకుంది. తెలుగులో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ చిత్రాలు,సోగ్గాడే చిన్నినాయినా చిత్రాలు విడుదల అవుతూ ధియోటర్స్ సమస్య రావటంతో ఈ సినిమాని చివరి నిముషంలో వాయిదా వేసినట్లు సమాచారం. విశాల్ కు మాత్రం తెలుగులోకూడా రిలీజ్ అయితే బాగుండేది అని ఉన్నా ఫలితం లేకుండా పోయింది.

గతకొంతకాలంగా విశాల్‌ పండుగలనే టార్గెట్‌ చేసుకున్నారు. హరి దర్శకత్వంలో గతంలో నటించిన ‘పూజై' దీపావళి సందర్బంగా విడుదలైంది. ఆ తర్వాత సుందర్‌.సి దర్శకత్వంలో వచ్చిన ‘ఆంబల' గత ఏడాది సంక్రాంతి కానుకగా తెరపైకి వచ్చింది. ఈ సంక్రాంతికి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ‘కథకళి'గా వస్తున్నారు విశాల్‌.

Vishal’s Kathakali is postponed

‘పసంగ 2' ద్వారా తాజాగా ఓ విజయాన్ని అందుకున్న పాండిరాజ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో మెడ్రాస్‌ ఫేం కేథరిన్‌ హీరోయిన్‌గా నటించింది. నాజర్‌, కరుణాస్‌, సూరి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. చిన్నారుల సినిమాల స్పెషలిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న పాండిరాజ్‌కు ఇది పెద్ద సినిమానే.

విశాల్‌వంటి స్టార్ హీరోతో ఆయన చేస్తున్న తొలి సినిమాగా దీన్ని చెప్పొచ్చు. తప్పనిసరిగా ఇందులోనూ వైవిధ్యాన్నే ప్రదర్శించి ఉంటారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి 2015 ఆఖరులో ఓ విజయాన్ని అందుకున్న పాండిరాజ్‌.. ఈ ఏడాది ప్రారంభంలోనూ మరో హిట్‌ను సొంతం చేసుకుంటారో.. లేదో.. తెలియాలంటే కొంచెం ఆగాల్సిందే.

English summary
Vishal told that they didn’t get proper theaters so the flick would be releasing on January 22 and not to have clash with Telugu big projects.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu