For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Waltair Veerayya: యూఎస్‌లో చిరంజీవి హవా.. బాలయ్య రికార్డు బ్రేక్.. అందులో వీర సింహా రెడ్డే టాప్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. మరీ ముఖ్యంగా కమ్‌బ్యాక్ అయినప్పటి నుంచి మరింత జోష్‌తో కనిపిస్తోన్న ఆయన.. వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిరంజీవి యూఎస్‌లో బాలయ్య రికార్డు బ్రేక్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

  వీరయ్యగా వచ్చేసిన చిరంజీవి

  వీరయ్యగా వచ్చేసిన చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ మరో ప్రధానమైన పాత్రలో చేసిన మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా చేశారు.

  నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!

  భారీ రిలీజ్.. థియేటర్లు కళకళ

  భారీ రిలీజ్.. థియేటర్లు కళకళ

  క్రేజీ మల్టీస్టారర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500లకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడిపోయాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ మెగా అభిమానుల ధాటికి మోత మోగుతూ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చాయి.

  టాక్‌ అలా... రెస్పాన్స్ మరోలా

  టాక్‌ అలా... రెస్పాన్స్ మరోలా

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రం ఏవరేజ్‌గా నిలుస్తుందని, ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ సరిగా ఉండదని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా నైట్ షోలు ఫుల్ అయ్యాయి.

  యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

  రికార్డు ఓపెనింగ్స్ వస్తాయని

  రికార్డు ఓపెనింగ్స్ వస్తాయని

  చిరంజీవి - రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి మొదటి రోజు టాక్‌తో సంబంధం లేకుండానే స్పందన మాత్రం భారీ స్థాయిలో వచ్చింది. ఫస్ట్ అండ్ సెకెండ్ షోలు కూడా హౌస్‌ ఫుల్ బోర్డులతో కనిపించాయి. దీంతో ఈ చిత్రానికి చిరంజీవి కెరీర్‌లోనే మంచి ఓపెనింగ్ కలెక్షన్లు దక్కే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

  ప్రీమియర్స్‌కే భారీ స్థాయిలో

  ప్రీమియర్స్‌కే భారీ స్థాయిలో

  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి ఓవర్సీస్‌లో భారీ స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో యూఎస్ బాక్సాఫీస్ రిపోర్టు ప్రకారం.. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారానే 638k డాలర్స్ గ్రాస్ వచ్చింది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 5.18 కోట్లు వచ్చాయి. అయితే, 'వీర సింహా రెడ్డి'కి మాత్రం ప్రీమియర్స్ ద్వారా 708k డాలర్స్ అంటే రూ. 5.75 కోట్లు దక్కాయి.

  ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!

  మొదటి రోజుతో కలిపి అలా

  మొదటి రోజుతో కలిపి అలా

  చిరంజీవి, రవితేజ ప్రధాన పాత్రల్లో బాబీ తెరకెక్కించిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి యూఎస్‌లో మొదటి రోజు భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ సినిమాకు దాదాపు 274K డాలర్లు వసూలైనట్లు తెలిసింది. దీంతో ప్రీమియర్స్ ప్లస్ మొదటి రోజు కలెక్షన్లు కలిపి అక్కడ 900K డాలర్లు వచ్చినట్లు శ్లోకా సంస్థ ప్రకటించింది. అంటే రూ. 7.31 కోట్లు గ్రాస్ అక్కడ వసూలు అయింది.

  బాలయ్య రికార్డు బ్రేక్ చేసేసి

  బాలయ్య రికార్డు బ్రేక్ చేసేసి


  'వాల్తేరు వీరయ్య' మూవీ యూఎస్‌లో ప్రీమియర్స్‌తో పాటు మొదటి రోజు కలిపి 900K డాలర్లు వసూలు చేయగా.. బాలకృష్ణ నటించిన 'వీర సింహా రెడ్డి' మాత్రం మొదటి రోజు కలెక్షన్లు డ్రాప్ అయిన కారణంగా 800K డాలర్లు రాబట్టినట్లు డిస్ట్రిబ్యూషన్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. దీంతో యూఎస్ గడ్డపై బాలయ్య రికార్డును చిరంజీవి బ్రేక్ చేసినట్లు అయింది.

  English summary
  Chiranjeevi and Ravi Teja Starrer Waltair Veerayya Movie Released January 13th Worldwide. Now This Movie Collects $900k Dollars Gross at USA Day 1
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X