War 2 Andhra, Nizam Box Office Collections: వార్ 2 ఆంధ్రా, నైజాం కలెక్షన్లు.. నష్టాల నుంచి బయటపడాలంటే?
బాలీవుడ్‌లో ప్రముఖ ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). వార్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమాను ఆయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్'గా నటిస్తున్న ఈ సినిమా అత్యంత క్రేజ్ ఉన్న మల్టీస్టారర్‌గా రూపొందింది. వార్ 2 సినిమా తెలుగు, హిందీ, తమిళంలో ఆగస్టు 14వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాను తెలుగులో సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నాగవంశీ రిలీజ్ చేశారు. ఇతర భాషల్లో ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ నేరుగా రిలీజ్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఎంత వసూలు చేయాలి? రెండు రోజుల్లో ఎంత వసూల చేసింది? అనే వివరాల్లోకి వెళితే..
వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను నిర్మాత నాగవంశీ సుమారుగా 90 కోట్ల (అదనంగా జీఎస్టీ) కు దక్కించుకొన్నారు. ఈ మూవీ మొత్తం థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 105 కోట్లుగా వాల్యూ కట్టారు. ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ, సీడెడ్ ప్రాంతాల్లో థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి 105 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి ) అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా ఏపీ, నైజాం బిజినెస్ వివరాల్లోకి వెళితే.. నిర్మాత నాగవంశీ భారీగానే హక్కులను భారీ రేట్లకు అమ్మినట్టు తెలుస్తున్నది. సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 18 కోట్ల రూపాయలు, ఆంధ్రా 40 కోట్ల రూపాయలు, నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ఈ సినిమాకు సుమారుగా 35 కోట్ల రూపాయలు వాల్యూ కట్టారని తెలిసింది. మొత్తంగా ఈ సినిమా 93 కోట్ల రూపాయల మేర బిజినెస్‌ను వాల్యూ చేశారు అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో 95 కోట్ల షేర్.. సుమారుగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది తెలిపారు.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ 2 చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. ఈ సినిమా రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్‌పై ప్రభావం పడింది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా కలెక్షన్లపరంగా జోరు చూపించలేకపోతున్నది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లను చూస్తే.. ఎన్టీఆర్ స్టామినాకు తగినట్టుగా ప్రభావం చూపించలేకపోయింది, గతంలో దేవర సినిమా సాధించిన ఓపెనింగ్స్‌ను కూడా మ్యాచ్ చేయలేకపోయింది. ఈ సినిమా తొలి రోజు 23 కోట్ల నెట్, రెండో రోజు 12 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. రెండు రోజుల్లో ఈ చిత్రం 35 కోట్ల రూపాయలు నెట్, 55 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











