War 2 Closing Collections: వార్ 2 క్లోజింగ్ కలెక్షన్స్.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన భారీ యాక్షన్ ఫిల్మ్ వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరును తగ్గించింది. ప్రస్తుతం కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. మొదటి వారం జోరుగా వసూళ్లు సాధించిన ఈచిత్రం ఇక 2వ వారానికి తగ్గిపోయింది. ఇక 3వ వారంలో మరీ వసూళ్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో వార్ 2 చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎని కోట్లు? వరల్డ్ వైడ్ గా ఎన్నికోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..
వార్ 2 మూవీ బడ్జెట్ ఎన్ని కోట్లు?
బాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో భారీ తారాగణం నటించడం విశేషం. తారక్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, ఆషుతోషు రాణా ప్రధాన పాత్రలు పోషించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేశారు. విదేశాల్లో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. దీంతో భారీగానే ఖర్చైంది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలన్నీ కలుపుకొని సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లంటే?
వార్ 2 మూవీ ప్రకటించినప్పటి నుంచే తారా స్థాయి అంచనాలు నెలకున్నాయి. భారీ తారాగణం నటించడంతో సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు స్టేట్స్ రైట్స్ రూ.105 కోట్లు, కర్ణాటక+ ROI హక్కులు రూ.19 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ.56 కోట్లు, నాన్ థియేట్రికల్, శాటిలైట్, ఆడియో రైట్స్ రూ.160 కోట్లకు అమ్ముడవ్వడం విశేషం. దీంతో వరల్డ్ వైడ్ గా రూ.340 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
వార్ 2కి 18 రోజుల వసూళ్లు?
ఓపెనింగ్ డే రూ.52 కోట్లు, 2వ రోజు రూ.58 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు, 4వ రోజు రూ.33 కోట్లు, 5వ రోజు రూ.8.75 కోట్లు, 6వ రోజు రూ.9 కోట్లు, 7వ రోజు రూ. 5.75 కోట్లు, 8వ రోజు రూ.5 కోట్లు, 9వ రోజు రూ.4 కోట్లు, 10వ రోజు రూ.6.85 కోట్లు నెట్, 11వ రోజు రూ.7.25 కోట్లు, 12వ రోజు రూ.2.15 కోట్లు, 13వ రోజు రూ.2.75 కోట్లు, 14వ రోజు రూ.2.5 కోట్లు, 15వ రోజు రూ.1.5 కోట్లు, 16వ రోజు రూ.65 లక్షలు, 17వ రోజు రూ.1.15 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసినట్టుగా సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 18వ రోజు రూ.1 కోటి వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా పూర్తిగా రూ.234 కోట్ల ఇండియా నెట్ వసూలైందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.
స్టేట్ వైజ్ కలెక్షన్స్..
హిందీలో వార్ 2 చిత్రానికి రూ.175 కోట్లు నెట్, తమిళంలో రూ.2.15 కోట్లు, తెలుగు స్టేట్స్ లో రూ.56.15 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.
క్లోజింగ్ కలెక్షన్స్..
ఇప్పటి వరకు వార్ 2 చిత్రానికి బాక్సాఫీస్ వద్ద రూ.234 కోట్ల ఇండియా నెట్ వసూలైందని, ఇండియా గ్రాస్ రూ.280 కోట్లు, ఓవర్సీస్ లో రూ.77 కోట్లు గ్రాస్, ఇక వరల్డ్ వైడ్ గా (ఇండియా + ఓవర్సీస్) రూ.356 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. అయినప్పటికీ ఈ చిత్రం రూ.250 కోట్ల వరకు నష్టాలనే చవి చూసిందని, ఇందులో తెలుగు స్టేట్స్ లోనే రూ.100 కోట్ల వరకు నష్టపోయిందని ట్రేడ్ పండింతులు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











