War 2 Day 10 Box office Collectons: 10వ రోజు జోరుగా వార్ 2 కలెక్షన్స్.. ఎన్టీఆర్ మూవీ ఎన్ని కోట్లు వసూళ్లు చేస
బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం వార్ 2 చిత్రం 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి వారం వసూళ్లు భారీగానే అందుకుంది. కానీ మిశ్రమ స్పందన అందడంతో ఆశించిన మేర వసూళ్లు రాకపోయినా ఓ మాదిరిగా వసూళ్లు అందుతూనే ఉన్నాయి. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2. ఈ భారీ స్పై యాక్షన్ ఫిల్మ్ ను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. ఆగస్టు 14న వరల్డ్ గా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్? 10వ రోజు వరల్డ్ వైడ్ కలెక్ష్స్? ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేయాలనే వివరాల్లోకి వెళితే..
వార్ 2 బడ్జెట్ ఎంత?
టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వార్ 2 చిత్రం రూపుదిద్దుకుంది. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా 2019లో వచ్చిన వార్ చిత్రానికి ఇది సీక్వెల్. ఈ చిత్రంలో భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లు, భారీ యాక్షన్ సీన్లు చిత్రీకరించడంతో సినిమాకు బడ్జెట్ ఎక్కువగా పెట్టాల్సి వచ్చింది. రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం, ప్రచార ఖర్చులు కలుపుకొని రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వార్ 2 చిత్రానికి రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇందులో తెలుగు రైట్స్ ద్వారా రూ.105 కోట్ల వ్యాపారం జరిగింది. నాగవంశీ సొంతం చేసుకున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కుల నుంచి రూ.19 కోట్లు, ఓవర్సీస్ ద్వారా రూ.56 కోట్లు, వ్యాపారం జరిగింది. ఓవర్సీస్, నాన్ థియేట్రికల్ ద్వారా రూ.160 కోట్ల బిజినెస్ అయ్యిందని తెలుపుతున్నారు. సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.
వార్ 2కి 9 రోజుల ఇండియా నెట్..
మొదటి వారంలో ఓపెనింగ్ డే రూ.52 కోట్లు, 2వ రోజు రూ.58 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు, 4వ రోజు రూ.33 కోట్లు, 5వ రోజు రూ.8.75 కోట్లు, 6వ రోజు రూ.9 కోట్లు, 7వ రోజు రూ. 5.75 కోట్లు వసూల్ చేసింది. ఇలా మొదటి వారం పూర్తయ్యే సరికి రూ.199.25 కోట్ల ఇండియా నెట్ వసూల్ అయ్యింది. ఇక 2వ వారంలోకి ఎంట్రీ ఇచ్చాక 8వ రోజు రూ.5 కోట్లు, 9వ రోజు రూ.4 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిక్ వెల్లడించింది.
10వ రోజు వసూళ్లు..
సెకండ్ వీకెండ్ వార్ 2 చిత్రానికి మళ్లీ జోరుగా వసూళ్లును అందిస్తోంది. ఆగస్టు 23న రెండో శనివారం ఈ చిత్రానికి సాయంత్రం 5 గంటల వరకు రూ.3 కోట్ల ఇండియా నెట్ వసూలైందని సాక్ నిక్ తెలుపుతోంది. మిగితా ఫస్ట్ షో, సెకండ్ షోల కలెక్షన్స్ కలుపుకొని 6 నుంచి 7 కోట్ల మధ్య వసూళ్లు సాధించి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా..
ఇప్పటి వరకు 10వ రోజు అంచనా వసూళ్లను కలుపుకొని ఇండియా నెట్ రూ.216 కోట్లు వసూల్ చేసిందని, ఇండియా గ్రాస్ రూ.260 కోట్లకు చేరుకుందని, ఓవర్సీస్ లో రూ.72 కోట్లు కలెక్ట్ అయినట్టు ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.332 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి. ఇందులో 9వ రోజు వరకు తెలుగు స్టేట్ లో రూ.53 కోట్లు, హిందీలో రూ.రూ.154 కోట్లు, తమిళంలో రూ.1.70 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు వివరిస్తున్నారు. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఇంకా 270 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించాలని తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











