War 2 Day 11 Box office Collectons: 11వ రోజు మరింత జోరుగా వార్ 2 కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వసూలైందంటే?
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన మల్టీస్టారర్ ఫిల్మ్ వార్ 2. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఇక బాలీవుడ్ లోని అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరుగా వసూళ్లు అందుకుంటోంది. ఈ చిత్రం సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్? 11వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంత? ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తే లాభాల్లోకి వస్తుందనే వివరాల్లోకి వెళితే..
వార్ 2 బడ్జెట్ ఎంత?
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. వార్ చిత్రానికి సీక్వెన్స్ గా వార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో భారీ తాగాణం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అషుతోష్ రాణా, అనిల్ కపూర్ ఈ చిత్రంలో నటించారు. టాప్ టెక్నీషియన్లు పనిచేశారు. విదేశాల్లో యాక్షన్ స్టంట్స్ ను షూట్ చేశారు. దీంతో నిర్మాతలు భారీగానే ఖర్చు చేశారు. రెమ్యునరేషన్, నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్?
వార్ 2 చిత్రానికి తెలుగు రైట్స్ ద్వారా రూ.105 కోట్ల వ్యాపారం జరిగింది. నాగవంశీ తెలుగు స్టేట్స్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. కర్ణాటకతో పాటు మిగిలిన రాష్ట్రాల హక్కుల ద్వారా రూ.19 కోట్లు, ఓవర్సీస్ ద్వారా రూ.56 కోట్లు బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్, నాన్ థియేట్రికల్ రైట్స్ నుంచి రూ.160 కోట్ల బిజినెస్ అయ్యిందని తెలుపుతున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వార్ 2 సినిమాకు రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక బ్రేక్ ఈవెన్ పాయింట్ చేరాలంటే రూ.700 కోట్లు గ్రాస్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కొట్టారు.
వార్ 2కి 10 రోజుల ఇండియా నెట్..
మొదటి వారంలో ఓపెనింగ్ డే రూ.52 కోట్లు, 2వ రోజు రూ.58 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు, 4వ రోజు రూ.33 కోట్లు, 5వ రోజు రూ.8.75 కోట్లు, 6వ రోజు రూ.9 కోట్లు, 7వ రోజు రూ. 5.75 కోట్లు, 8వ రోజు రూ.5 కోట్లు, 9వ రోజు రూ.4 కోట్లు, 10వ రోజు రూ.6.25 కోట్లు నెట్ వసూల్ చేసింది. దీంతో 215 కోట్ల రూపాయల ఇండియా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది.
11వ రోజు కలెక్షన్స్..
వార్ 2 చిత్రానికి 2వ వారాంతంలో జోరుగా వసూళ్లు అందుతున్నాయి. ఇక సెకండ్ వీక్ లోని ఆదివారం ఆగస్టు 24న సాయంత్రం 5 గంటల వరకు రూ.4 కోట్ల ఇండియా నెట్ ను వసూల్ చేసిందని సాక్ నిక్ వెల్లడించింది. మిగిలిన ఫస్ట్ షో, సెకండ్ షోకు సంబంధించిన వసూళ్లు కలుపుకొని ఈ చిత్రానికి 11వ రోజు రూ.8 కోట్ల వరకు ఇండియా నెట్ వసూలైందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల వసూళ్లు..
10 రోజుల్లో వార్ 2 చిత్రానికి 215 కోట్ల ఇండియా నెట్ వసూలైంది. ఇక ఇండియా గ్రాస్ రూ.256 కోట్లకు చేరుకుంది. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రం రూ.73 కోట్ల గ్రాస్ ను అందుకుంది. 10వ రోజు వరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని రూ.329 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











