War 2 Box Office Report: వార్ 2 మూవీకి ఎన్ని కోట్ల నష్టం? ఎన్టీఆర్‌కు అలాంటి చేదు అనుభవమేనా?

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో ప్రముఖ యువ దర్శకుడు ఆయన్ ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందిన వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకొంటున్నది. హిందీ సినిమా పరిశ్రమలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలింస్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత నాగవంశీ సూర్య దేవర రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత అంచనాలకు భిన్నంగా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద తడబాటుతో కొనసాగుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన 12 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వార్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాకు బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు అందిస్తున్నారు. ఈ సినిమాను సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ గ్రాండ్‌గా రూపొందించారు.

War 2 Day 12 Box office

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రా, నైజాం ప్రాంతాలకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ 90.5 కోట్ల రూపాయలు (జీఎస్టీతో కలిపి 105 కోట్లు), కర్ణాటక రైట్స్ 15 కోట్లు, హిందీ 160 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 40 కోట్ల రూపాయలు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 305 కోట్ల రూపాయల మేర థియేట్రికల్ రైట్స్ వ్యాపారం నమోదైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమాను సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

వార్ 2 సినిమా భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా తొలి రోజు 86 కోట్ల రూపాయల గ్రాస్, 58 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. హిందీలో 28 కోట్ల రూపాయలు, తెలుగలో 21 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో వసూళ్లు దారుణంగా పడిపోయాయి. ఈ సినిమా రెండో రోజు నుంచి వసూళ్లు క్రమంగా క్షీణించడం మొదలుపెట్టాయి.

వార్ 2 సినిమా తిొలి వారం ముగిసే సమయానికి 245 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగులో 62.5 కోట్ల రూపాయలు, హిందీలో 160 కోట్ల రూపాయలు, కన్నడలో 17 కోట్ల రూపాయలు, తమిళంలో 6 కోట్ల రూపాయలు, కేరళలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో వారంలో 9వ రోజు 4 కోట్ల రూపాయలు, 10వ రోజు రెండో శనివారం 6.5 కోట్లు, 11వ రోజు రెండో ఆదివారం 7.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 262 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 75 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో 262 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా 342 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక 12వ రోజు వార్ 2 సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ మూవీ సోమవారం పెద్దగా ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించే పరిస్థితి కనిపించడం లేదు. ఇండియా వైడ్ ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈవెనింగ్ షోలకు ఆక్యుపెన్సీ పెరిగితే మరింతగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

వార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా ఎన్టీఆర్ మూవీ ముందు భారీ లక్ష్యమే ఉంది. ఈ సినిమా సుమారుగా 600 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా సుమారుగా 200 కోట్లకుపైగా గ్రాస్ నష్టంతో.. సుమారుగా 120 కోట్ల షేర్ నష్టంతో ముగిసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా బాలీవుడ్ ఎంట్రీతో తన సత్తాను చాటాలనుకొన్న ఎన్టీఆర్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Read more about: war 2 jr ntr box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X