War 2 Day 3 Box Office: వార్ 2 3వ రోజు వసూళ్లు.. రఫ్పాడిస్తున్న తారక్, హృతిక్.. ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2. ఈ మల్టీస్టారర్ చిత్రంలో గ్లోబల్ స్టార్ జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. బ్రహ్మాస్త్రం డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఆగస్టు 14న హిందీతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ క్రమంలో వార్ 2 చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత? 3వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎంత వచ్చే అవకాశం ఉందనే వివరాల్లోకి వెళితే..
వార్ 2 మూవీ బడ్జెట్ ఎంత?
2019లో వచ్చిన వార్ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలవడంతో వార్ 2 చిత్రాన్ని మరింత గ్రాండ్ గా నిర్మించారు. భారీ తారాగణాన్ని ఎంపిక చేశారు. తారక్, హృతిక్ కియారా అద్వానీతో పాటు, అనిల్ కపూర్, అశుతోష్ రాణా, వరుణ్ బదోలా, దిశిత సెహగల్, సోని రజ్దాన్ ముఖ్య పాత్రల్లో మెరిశారు. ప్రీతమ్ సంగీత అందించగా, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బీజీఎం సమకూర్చారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు కలుపుకొని సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపతున్నారు.

వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
జూ.ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ వంటి భారీ తారాగణం, మరోవైపు టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో సినిమా థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.175 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. తెలుగు వెర్షన్ రైట్స్ ను యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ 105 కోట్ల రూపాయలతో అందుకున్నారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా రూ.19 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ.56 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ.340 కోట్ల రూపాయల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో చిత్రం రూ.700 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు వాల్యూ కట్టారు.
వార్ 2 రెండ్రోజుల వసూళ్లు..
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గా రూ.85 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. ఇక 2వ రోజు ఈ చిత్రానికి రూ.83 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. రెండ్రోజుల్లో కలిసి ఇండియా నెట్ రూ. 110 కోట్లు వసూళ్లు చేసింది. రెండ్రోజుల్లో హిందీలో రూ.74 కోట్లు, తమిళంలో రూ.60 లక్షలు, తెలుగులో రూ.35 కోట్లు వసూల్లు చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక ఇండియా గ్రాస్ రూ.130 కోట్లు, ఓవర్సీస్ లో రూ.38 కోట్లు వసూళ్లు చేసింది. ఇండియా+ఓవర్సీస్ కలుపుకొని 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.168 కోట్ల గ్రాస్ వసూల్ అందుకుంది.
3వ రోజు కలెక్షన్స్..
వార్ 2 చిత్రం విడుదలై ఫస్ట్ వీకెండ్ శనివారం ఆగస్టు 16న ఈ చిత్రానికి మంచి వసూల్ అందినట్టు ట్రేడ్ వర్గాల ఎర్లీ రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు వార్ 2 చిత్రానికి 13 కోట్లు రూపాయల ఇండియా నెట్ వసూల్ అయ్యిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇక ఫస్ట్ షో, సెకండ్ షోలు + ఓవర్సీస్ కలుపుకొని రూ.70 కోట్ల రూపాయల నుంచి రూ.80 కోట్ల రూపాయల మధ్య గ్రాస్ అందుకుంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేశారు. ఇక 3వ రోజు వసూళ్లతో ఈ చిత్రం 200 కోట్ల క్లబ్ లో చేరబోతోంది.


Click it and Unblock the Notifications











