War 2 Day 4 Box Office: వార్ 2 సినిమా 4వ రోజు కలెక్షన్లు.. ఎన్టీఆర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్ 2. ఈ చిత్రానికి బ్రహ్మాస్త్రం మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత ఆదిత్యా చోప్రా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆషుతోష్ రాణా, అనిల్ కపూర్, కియారీ అద్వానీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 14న హిందీతో పాటు భారతీయ ప్రధాన ప్రాంతీయ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. ఇక ఈ చిత్రం బడ్జెట్? ప్రీ రిలీజ్ బిజినెస్? 4వ రోజు బాక్సాఫీస్ వసూళ్ల వివరాల్లోకి వెళితే..

వార్ 2 మూవీ బడ్జెట్?
బాలీవుడ్ లో అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ లో వార్ 2 చిత్రం నిర్మితమైంది. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో 2019లో వచ్చిన వార్ చిత్రానికి ఇది సీక్వెల్ కావడం విశేషం. దీంతో మరింత గ్రాండ్ గా నిర్మించారు. ఈ క్రమంలో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునర్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాల ఖర్చులన్నీ కలుపుకొని సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

War 2 Day 4 Expected Box Office Collections Worldwide

వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్?
విడుదలకు ముందే వార్ 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. దీంతో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఈ చిత్రానికి ఏకంగా రూ.340 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్ ను యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ సూర్య దేవర నాగవంశీ రూ.105 కోట్లతో దక్కించుకోవడం విశేషం. కర్ణాటక, ఇతర రాష్ట్రాల రైట్స్ ద్వారా రూ.19 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ.56 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.700 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

వార్ 2 చిత్రానికి 3 రోజుల ఇండియా నెట్..
తొలి రోజు ఇండియాలో వార్ 2 చిత్రానికి రూ.52 కోట్ల నెట్, 2వ రోజు 57.35 కోట్లు, 3వ రోజు రూ.33.25 కోట్లు వసూలైంది. ఇలా 3 రోజుల్లో ఇండియా నెట్ రూ.143 కోట్లకు చేరుకుందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇందులో హిందీలో రూ.99.5 కోట్లు, తమిళంలో రూ.1 కోటి, తెలుగులో రూ.42 కోట్లు వసూళ్లు చేయడం విశేషం.

వార్ 2కి 4వ రోజు వసూళ్లు..
వార్ 2 చిత్రం మొదటి వీకెండ్ బాక్సాఫీస్ నుంచి మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ క్రమంలో 4వ రోజు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు రూ.16 కోట్లు వసూళ్లు చేసిందని సాక్ నిక్ తెలిపింది. ఇక థియేటర్ లో ఆక్యుపెన్సీ కూడా 30 శాతం యావరేజ్ గా నమోదు కావడం విశేషం. ఇక ఫస్ట్ షో, సెకండ్ షోల లెక్కలు కలుపుకొని ఈ చిత్రానికి రూ.40 కోట్ల ఇండియా నెట్ వసూలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..
ఓపెనింగ్ డే వార్ 2 చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.85 కోట్లు గ్రాస్ వసూల్ చేయడం విశేషం. ఇక 2వ రోజు రూ.83 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. 3వ రోజు రూ.65 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక ఇప్పటి వరకు ఇండియా నెట్ రూ.143 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.170 కోట్లు, ఓవర్సీస్ లో రూ.45 కోట్లు వసూల్ అయినట్టు సాక్ నిక్ తెలిపింది. దీంతో ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకొని రూ.215 కోట్లు వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X