War 2 AP, TG Box Office: వార్ 2 కి నైజాంలో జీరో షేర్.. ఎన్టీఆర్ మూవీ దారుణంగా.. ఎన్ని కోట్ల నష్టమంటే?
బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులు ఎదురు చూసిన వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టిన పరిస్థితి కనిపిస్తున్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ హృతిక్ రోషన్ జంటగా, కియారా అద్వానీ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం కంటెంట్ పరంగా ఆకట్టుకోలేకపోవడంతో వసూళ్ల రాబట్టే క్రమంలో చతికిలపడింది. బ్రహ్మస్త ఫేమ్ ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించాడు. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే..
యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లో స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన వార్ 2 చిత్రాన్ని ఆదిత్య చోప్రా సొంతంగా రిలీజ్ చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సితారా ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత నాగవంశీ ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్‌ను 90 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడనే విషయం ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ భారీగా ఎదుర్కోవడం తెలిసిందే.

వార్ 2 సినిమా ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 62 కోట్ల రూపాయలు, రెండో రోజు 67.5 కోట్లు, మూడో రోజు 39 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 38 కోట్ల రూపాయలు, ఐదో రోజు 8.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం స్వదేశీ బాక్సాఫీస్ వద్ద 217 కోట్ల నెట్, ఓవర్సీస్‌లో 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 250 కోట్ల రూపాయలు నెట్, 301 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
వార్ 2 చిత్రం వివిధ రాష్ట్రాల్లో గత 4 రోజుల్లో వసూలు చేసిన ఈ సినిమా కలెక్షన్ల ఈ విదంగా ఉన్నాయి. కర్ణాటకలో 15 కోట్ల రూపాయలు, తెలుగులో 56 కోట్ల రూపాయలు, తమిళనాడులో 4.5 కోట్ల రూపాయలు, మలయాళంలో 1.5 కోట్ల రూపాయలు, హిందీలో 131 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తొలి రోజు 27 కోట్ల రూపాయలు, రెండో రోజు 14 కోట్ల రూపాయలు, మూడో రోజు 8.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7.5 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 5.5 కోట్ల రూపాయలు తూర్పు గోదావరి జిల్లాలో 3.25 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.25 కోట్లు, నెల్లూరులో 1.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా 70 కోట్ల రూపాయల షేర్, 57 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక వార్ 2 ఆంధ్రా, నైజాంలో 5వ రోజు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు ప్రేక్షకులు ముఖం చాటేయడంతో పలుచోట్ల షోలను రద్దు చేశారు. నైజాంలో ఈ సినిమా జీరో షేర్‌ను సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 1.5 కోట్ల రూపాయల మాత్రమే రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా కనీసం 52 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











