War 2 Day 6 Box Office: వార్ 2కి షాకింగ్ వసూళ్లు.. హృతిక్, ఎన్టీఆర్‌ల మూవీకి ఎన్ని కోట్లంటే?
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్, గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా గతంలో వచ్చిన సూపర్‌హిట్ మూవీ వార్‌కి సీక్వెల్‌గా వార్ 2 చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మించారు. ఈ నేపథ్యంలో వార్ 2 బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 6వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే.
వార్ 2 బడ్జెట్ ఎంత?
అశుతోష్ రాణా, అనిల్ కపూర్, దిశిత సెహగల్, వరుణ్ బదోలా, సోని రజ్దాన్ తదితరులు వార్ 2 లో కీలకపాత్రలు పోషించారు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే, అబ్బాస్ టైర్‌వాలా సంభాషణలు అందించారు. బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫిని, ప్రీతమ్ పాటలు, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హార బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. అలాగే ఆరీఫ్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి వార్ 2కు సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

వార్ 2 బిజినెస్ ఎంత?
వార్ 2 హిందీ వెర్షన్‌ను నార్త్ ఇండియాలో యష్ రాజ్ ఫిలింస్ సొంతంగా రిలీజ్ చేసింది. దీంతో ఉత్తర భారతంలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్‌ను సుమారుగా 175 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు ట్రేడ్ పండితులు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సుమారుగా 90 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి 105 కోట్లు)వెచ్చించి తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 19 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 56 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాంతో వార్ 2 మూవీకి వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 340 కోట్ల రూపాయల మేర జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల సినిమా లాభాల్లోకి రావాలంటే 350 కోట్ల రూపాయల షేర్, 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని వాల్యూ కట్టారు. భారీ అంచనాల నేపథ్యంలో వార్ 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
వార్ 2 ఐదు రోజుల కలెక్షన్స్
వార్ 2 సినిమా భారతదేశంలో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 54 కోట్ల రూపాయలు, రెండో రోజు 60 కోట్ల రూపాయలు, మూడో రోజు 35 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 33 కోట్ల రూపాయలు, ఐదో రోజు 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 184 కోట్ల రూపాయల నెట్, 219 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో వార్ 2.. 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి 5 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 289 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 కలెక్షన్స్
వార్ 2 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూస్తే.. తొలి రోజు 23 కోట్ల రూపాయలు, రెండో రోజు 13 కోట్ల రూపాయలు, మూడో రోజు 8.25 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 7 కోట్ల రూపాయలు, 5వ రోజున 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి వరకు నైజాంలో 13 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 7.66 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 3.50 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలు, గుంటూరులో 4.25 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 3.50 కోట్లు, నెల్లూరులో 1.80 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో వార్ 2 సినిమా ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 41 కోట్ల రూపాయల షేర్, 59 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో వార్ 2 కలెక్షన్స్ చూస్తే .. కర్ణాటకలో 16 కోట్ల రూపాయలు, తెలుగులో 58 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5.52 కోట్ల రూపాయలు, మలయాళంలో కోటి రూపాయలు, హిందీలో 133 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది.
వార్ 2 ఆరవ రోజు కలెక్షన్స్
తొలి 4 రోజుల్లో వార్ 2 కలెక్షన్ల వర్షం కురిపించగా.. సోమవారం నుంచే అసలు సిసలు పరీక్ష మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోని కీలక రాష్ట్రాల్లో భారీ వర్షాలకు తోడు వర్కింగ్ డేస్ కావడంతో బుకింగ్స్ భారీగా పడిపోయాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వార్ 2కి హిందీ వెర్షన్‌లో 17 శాతం, తమిళ వెర్షన్‌లో 17 శాతం, తెలుగు వెర్షన్‌లో 16 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. 6వ రోజు వార్ 2 చిత్రం హిందీలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, తమిళనాడు + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. మొత్తంగా 6 రోజుల వరకు వార్ 2 మూవీ వరల్డ్ వైడ్‌గా 295 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 52 కోట్ల రూపాయల షేర్ రావాల్సి ఉండగా.. వరల్డ్ వైడ్‌గా 166 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వార్ 2కి భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











